పంట పరిహారం ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2021-11-29T06:28:17+05:30 IST

ఓవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు బ్యాంకుల సహాయ నిరాకరణ అన్నదాతను నిండా కుంగదీస్తోంది. బ్యాంకులు సహకరించకపోవడంతో ప్రైవేటు వ్యా పారుల నుంచి ఎక్కువ మొత్తానికి అప్పులు చేసి సాగు చేసిన అన్నదాతను ప్రకృతి పగబట్టి చేతికి వచ్చిన పంటనంతా నాశనం చేయడంతో వారంతా విలవిలలాడారు.

పంట పరిహారం ఇంకెప్పుడు?
నిర్మల్‌ మండలంలోని తల్వేద శివారులో పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలు (ఫైల్‌)

ఏడాది గడుస్తున్నా కనిపించని కదలిక
సర్కారుకు పట్టని అన్నదాత ఎదురుచూపులు
అప్పుల బాధలతో తిప్పలు  
ప్రస్తుత ఖరీఫ్‌, రబీ సాగులపై ప్రభావం


నిర్మల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఓవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు బ్యాంకుల సహాయ నిరాకరణ అన్నదాతను నిండా కుంగదీస్తోంది. బ్యాంకులు సహకరించకపోవడంతో ప్రైవేటు వ్యా పారుల నుంచి ఎక్కువ మొత్తానికి అప్పులు చేసి సాగు చేసిన అన్నదాతను ప్రకృతి పగబట్టి చేతికి వచ్చిన పంటనంతా నాశనం చేయడంతో వారంతా విలవిలలాడారు.
దాదాపు ఐదారు వందల ఎకరాల కన్నా..
సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన అకాల వర్షాల కారణంగా ని ర్మల్‌ జిల్లాలో దాదాపు ఐదారు వందల ఎకరాల కన్నా ఎక్కువ భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చే సమయం లో పంటంత నాశనమైన కారణంగా రైతులు తీవ్రమైన ఆర్థిక ఆటుపోట్లకు గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకు న్న పంటలు అకాల వర్షాల కారణంగా నష్టపోవడం తో కుంగిపోయారు. తమను ఆదుకోవాలంటూ అ ధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరి గేలా తిరగడంతో సంబంధిత అధికారులు మాత్రం నష్టంపై సర్వేలు నిర్వహించి స ర్కారుకు నివేదికలు పంపారు. ఆ నివేదికలను ప్రభుత్వం పట్టించుకోకుం డా పక్కన పడేసినట్లు ఆరోపణ లు వెల్లువెత్తాయి.
2021 సంవత్సరంలో కూడా..
2021 సంవత్సరంలో కూడా భారీ వర్షాలు పం టలకు తీవ్ర నష్టం చేకూర్చాయి. 2020లో జరిగిన న ష్టానికి సంబంధించి ఇప్పటివ రకు సర్కారు స్పందించనప్పటికీ అధికారులు 2021 సంవత్సరంలో భారీ వర్షాలు వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని మాత్రం రూ పొందించారు. మొత్తం 17,671 ఎకరాల్లో వివిధ రకాల పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈపంట నష్టం నివేదికను రూపొందించాలంటూ మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ అధికారులే తమ విధుల్లో భాగంగా నివేదికలు రూపొందించ డం గమనార్హం.  తామంతా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి పంట నష్ట పరిహారం నివేదికలు రూపొందించి పంపుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్న భావనతో నిరాసక్తతను కనబరుస్తున్నారంటున్నారు. ఈ సారి కూడా బ్యాంకులు రుణమాఫీ వ్యవహారంతో కొత్తగా పంట రుణా లు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కొంతమంది కి రుణాలు అందించిన బ్యాంకులు చిన్న, సన్నకారు రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న విమర్శలున్నాయి. బ్యాంకుల సహాయ నిరాకరణ కారణంగా రైతులు మొన్నటి ఖరీఫ్‌తో పాటు రబీ పంటల సాగుకోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోందన్న వాదనలున్నాయి.
హైకోర్టును ఆశ్రయించిన రైతులు
పంట నష్ట పరిహారం అందించకుండా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందంటూ తమకు న్యాయం జరిగేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ప్రభుత్వం మానవీయ కోణంతో పరిశీలించి పంట నష్ట పరిహారాన్ని అందించాలని సర్కారును ఆదేశించింది. కోర్టు ఆదేశించి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నష్టపోయిన రైతుల సమాచారాన్ని మూడు నెలల్లో సేకరించి రైతులనే కాకుండా కౌలు రైతులను సైతం పరిగణలోకి తీసుకోవాలంటూ హైకోర్టు సూచించింది. తమ ఆదేశాలు వెలువడిన అనంతరం నెల రోజుల్లోగా రైతులందరికీ పరిహారం అందించాలని, బీమా పథకాలు కూడా దీనికి వర్తింపజేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం జిల్లాలోని 500 హెక్టార్లకు గానూ అందులో 33శాతం కంటే ఎక్కువగా పంట నష్టం జరిగిందంటూ రైతు స్వరాజ్య వేదిక హైకోర్టుకు తెలిపింది. అయితే రాష్ట్ర హైకోర్టు మానవీయ కోణంతో స్పందించి సర్కారుకు ఆదేశాలు జారీ చేసినప్పటికి ఆ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రైతాంగం ఆరోపిస్తోంది.
ఈసారి ముంచిన వరదలు..
ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో కూడా వరదలు పంటలను నిం డా ముంచాయి. మొత్తం జిల్లాలో 17,671 ఎకరాల్లో వివిధ ర కాల పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. మొత్తం పత్తి పంట 9206 ఎకరాల్లో, సోయా పంట 2544 ఎకరాల్లో, వరి పంట 2679 ఎకరాల్లో , కంది 486 ఎకరాలు, పసుపు 1418 ఎకరాలు, మొక్కజొన్న 1338 ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు తమ సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. ఈ నివేదికలను మళ్లీ ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటివరకు 2020 అలాగే 2021 సంవత్సరాల్లో జరిగిన పంట నష్టంకు సంబంధించిన పరిహారంపై మాత్రం నోరు మెదపడం లేదు.
ఏడాది గడుస్తున్నా కదలిక కరువు..
ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం జిల్లా లో 33 శాతానికి పైగా పంట నష్టం జరిగిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ప రిహారం అందించాల్సి ఉంటుంది. ఇదే అంశా న్ని రైతు స్వరాజ్య వేదిక అటు ప్రభుత్వం దృ ష్టికి ఇటు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకుపోయింది. రాష్ట్ర హైకోర్టు పరిహారం చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత యంత్రాంగం మాత్రం కోర్టు ఆదే శాలను పక్కన పెట్టి ఏడాది గడుస్తున్న పరిహారం విషయంలో స్పందించడం లేదు. రైతులు తమకు పరిహా రం అందించాలని, ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు అందించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని అఽధికారులను కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి హా మీ దక్కలేదు. కౌలు రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఏడాది నుంచి పరిహారం కోసం ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోతుండడం పట్ల అన్నదాత ఆగ్రహానికి లోనవుతున్నాడు. రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం పంట నష్టాని కి సంబందించిన పరిహారం అం దించాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కో ర్టు ఆదేశాలకు అనుగుణంగా రై తు సంఘాలు పరిహారంపై అధికారు ల ను నిలదీసినప్పటికీ నిధుల లేమి కారణంగా చే తులేత్తేస్తుండడం చర్చకు తావిస్తోంది.
కనికరించని బ్యాంకులు..
రుణమాఫీ వ్యవహారం రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం 25వేలు అలాగే 50వేల రుణం తీసుకున్న వారికే మాఫీని వర్తింపజేస్తుండడంతో ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న రైతులు ప్రస్తుతం మాఫీ కోసం ఎదురుచూస్తూ రుణాలు చెల్లించేందుకు వెనకాడుతున్నారు. దీని కారణంగా బ్యాంకులు పంట రుణాల చెల్లింపు విషయంలో వెనకాడుతున్నాయి. తాము ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నామని, రైతులు బ్యాంకర్లకు వివరిస్తున్నప్పటికీ బ్యాంకర్లు మా త్రం అనేక కొర్రీలు పెడుతున్నారంటున్నారు. గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. రైతుల అవసరం, అమా యకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వడ్డీ వ్యాపారులు ఇష్టానుసారంగా రై తుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈసారి కూడా ఖరీఫ్‌ పంటలను వర్షాలు నిండా ముం చేశాయి. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాధికారులు ఈసారి జరిగిన పంట నష్టంపై సర్వే చేయకుండా చేతులు దులుపుకుంటుంది. ధాన్యం కొనుగోలుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతుండగా ఇప్పటివరకు పంటలు నష్టపోయిన అన్నదాతలను మాత్రం ఆదుకునే దిశగా కార్యాచరణ జరగకపోతుండడం విమర్శలకు తావిస్తోంది.


Updated Date - 2021-11-29T06:28:17+05:30 IST