వీటికి మోక్షం ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-08-02T06:24:55+05:30 IST

ఇవి పార్కింగ్‌ స్థలంలో నిలిపిన వాహనాలనుకుంటే తప్పులో కాలేసినట్లే. సారా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తూ ఎస్‌ఈబీ పోలీసులకు పట్టుబడినవి.

వీటికి మోక్షం ఎప్పుడో?
ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేసిన వాహనాలు

రెండేళ్లుగా తుప్పుపడుతున్న ఎస్‌ఈబీ సీజ్డ్‌ వాహనాలు


  • ( మదనపల్లె టౌన్‌)

 ఇవి పార్కింగ్‌ స్థలంలో నిలిపిన వాహనాలనుకుంటే తప్పులో కాలేసినట్లే. సారా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తూ ఎస్‌ఈబీ పోలీసులకు పట్టుబడినవి. రెండేళ్లుగా 300 కేసులకు సంబంధించి 300కుపైగా వాహనాలు తుప్పుపడుతున్నాయి. మదనపల్లె ఎస్‌ఈబీ సర్కిల్‌ పరిధిలో మదనపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. దీంతో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం ప్యాకెట్లు.. పలు తాండాల్లో  సారా తయారుచేసి పట్టణాలకు రవాణా చేస్తున్నారు. వీటిపై ఎస్‌ఈబీ, డీటీఎఫ్‌ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, సిమెంటు ట్యాంకర్లు కూడా కర్ణాటక మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డాయి. రెండేళ్లుగా వీటి వేలానికి అఽధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొన్ని వాహనాలు రూపురేఖలు మారిపోయా యి. ఇకనైనా ఎస్‌ఈబీ ఉన్నతాధికారులు సీజ్‌ చేసిన వాహనాల వేలం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి.


Updated Date - 2021-08-02T06:24:55+05:30 IST