క్రమబద్ధీకరణకు మోక్షమెప్పుడు..?

ABN , First Publish Date - 2022-05-25T04:16:02+05:30 IST

ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్ప రుచుకున్న అర్హులైన వ్యక్తులు తమ స్థలాలు క్రమబద్ధీకరిం చాలని చేసుకున్న దరఖాస్తులకు మోక్షం కలుగడం లేదు.

క్రమబద్ధీకరణకు మోక్షమెప్పుడు..?
లోగో

-  అమలుకు నోచుకోని జీవో 58, 59

- లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 24: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్ప రుచుకున్న అర్హులైన వ్యక్తులు   తమ స్థలాలు క్రమబద్ధీకరిం చాలని చేసుకున్న దరఖాస్తులకు మోక్షం కలుగడం లేదు.  తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసుకున్న వాటిని చట్టబద్ధం చేయా లనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జీవో 58, 59ను తీసు కొచ్చింది. అలాంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31లోగా మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసు కోవాలని సూచించింది. మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడలేదు.  జిల్లా వ్యాప్తంగా 813 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జీవో 58 కింద 342 మంది, జీవో 59 కింద 471 మంది దరఖాస్తు చేసుకు న్నారు. అలాగే 2016లో సైతం జీవో 58 కింద 513 మంది, జీవో 59 కింద 340 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- 2014 జూన్‌ 2కు ముందు ఆక్రమణలకే..

జీవో నంబరు 58, 59లో భాగంగా 2 జూన్‌ 2014 నాటికి ముందు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేసుకున్న వాటిని, నివా సేతర భూములనే క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, స్థలాలను నామమాత్రపు ఫీజులతో క్రమబద్ధీకరించే అవ కాశాన్ని జీవో 58, 59 కల్పించింది. 2014లో జీవో 58, 59 తీసుకొచ్చిన సమయంలో కొంత మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వివిధ కారణాలతో అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోని వారు ఉన్నారు. దీంతో ప్రభు త్వం మరో ఆవకాశం ఇవ్వాలని భావించి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జీవో 14ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గతంలో తిరస్కరణకు గురైన వాటితో పాటు కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు మీసేవా కేంద్రాల్లో దరఖా స్తులను ఆహ్వానించింది. కాగా దరఖా స్తుల ప్రక్రియి నెలలు గడుస్తున్నా క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభు త్వం నుంచి ఎలాంటి మార్గ దర్శకాలు విడుదల కాలేదు.  దీంతో దరఖా స్తులు చేసుకున్న ప్రజలకు ఎదురు చూపు తప్పడం లేదు. 

- నిర్ణీత ధర..

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేసుకున్న వారు నివాసేతర భూ ములను ఆక్రమించుకున్న వారు ప్రభుత్వం సూచించిన నిర్ణీత ధరను చెల్లించాల్సి ఉంటుంది. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమిం చుకుని ఇళ్లు కట్టుకున్న వారు వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తా రు. 125 నుంచి 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ ధర లో 50 శాతం, 250 నుంచి 500 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ ధరలో 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 500 నుంచి 1000 చదరపు గజాల్లో నిర్మాణం చేసుకున్న వారు ప్రభుత్వ ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 


త్వరలోనే సర్వే ప్రారంభిస్తాం..

- కదం సురేష్‌, డీఆర్వో

ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో 58పై త్వరలోనే సర్వే ప్రారం భిస్తాం. మండలానికి ఒక జిల్లా అధికారితో పాటు సర్వేయర్‌, ఆర్‌ఐ లతో బృందాలను ఏర్పాటు చేశాం. జూన్‌ 2లోగా ఈ సర్వేను పూర్తి చేస్తాం. సర్వే అనంతరం వివరాలను అప్‌లోడ్‌ చేయనున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేస్తాం. జీవో 59పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. 

Updated Date - 2022-05-25T04:16:02+05:30 IST