కరోనా నుంచి కోలుకున్నారా.. ఎలా తెలుస్తుంది..?

ABN , First Publish Date - 2020-04-11T03:50:17+05:30 IST

దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా చెబుతారు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనపడితే వెంటనే వారికి కరోనా నిర్ధారణ పరీక్ష...

కరోనా నుంచి కోలుకున్నారా.. ఎలా తెలుస్తుంది..?

న్యూఢిల్లీ: దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా చెబుతారు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనపడితే వెంటనే వారికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభిస్తారు. అయితే వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడని డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు..? వారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు..? అనే ప్రశ్నలకు డాక్టర్లు ఈ విధంగా చెబుతున్నారు.


ప్రధానంగా మన దేశంలో దీనికి సంబంధించి ఓ విధానాన్ని పాటిస్తున్నారు. వ్యక్తికి కరోనా తగ్గిందని నిర్ధారించేందుకు ముందుగా ఊపిరితిత్తులకు సంబంధించి చెస్ట్ రేడియోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్లియరెన్స్ వస్తే.. ఊపిరితిత్తుల్లో వైరస్ పూర్తిగా నాశనమైందా లేదా అని పరీక్ష నిర్వహిస్తారు. ఇది కూడా క్లియరెన్స్ రావలసి ఉంటుంది. ఇలా రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తారు. రెండు సార్లూ నెగెటివ్ వస్తే అప్పుడు ఆ వ్యక్తికి కరోనా పూర్తిగా తగ్గిందని డాక్టర్లు నిర్ధారించి డిశ్చార్జ్ చేస్తారు. అయితే రెండు పరీక్షలకు కనీసం 24 గంటల వ్యవధి ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే డిశ్చార్జ్ చేసిన తరువాత అతడిలో వ్యాధినిరోధక శక్తి  అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోగా ఎవరైనా కరోనా పేషెంట్‌తో అతడు సన్నిహితంగా వెళితే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది. అందువల్ల 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండమని అతడికి డాక్టర్లు సూచిస్తారు.

Updated Date - 2020-04-11T03:50:17+05:30 IST