మెంతి కూర అనుకుని గంజాయి తిన‌డంతో....

ABN , First Publish Date - 2020-07-01T12:01:18+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగుచూసింది. కొంత‌మంది సరదాగా చేసిన ప‌ని... ఒక‌ కుటుంబాన్ని అనారోగ్యంపాలు చేసింది. ఆ కుటుంబ స‌భ్యులు మెంతి కూర‌గా భావించి...

మెంతి కూర అనుకుని గంజాయి తిన‌డంతో....

క‌న్నౌజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగుచూసింది. కొంత‌మంది సరదాగా చేసిన ప‌ని... ఒక‌ కుటుంబాన్ని అనారోగ్యంపాలు చేసింది. ఆ కుటుంబ స‌భ్యులు మెంతి కూర‌గా భావించి, గంజాయితో కూర వండుకుని తిన్నారు. దీంతో వారంతా అనారోగ్యం పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి, ఈ చ‌ర్య‌కు పాల్ప‌డి, ఆ కుటుంబాన్ని ఆటప‌ట్టించిన నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం కన్నౌజ్ ప‌రిధిలోని మియాగంజ్ గ్రామానికి చెందిన నితేష్ గంజాయిని మెంతిపొడి అనిచెప్పి, త‌న బావ‌మ‌రిది ఓం ప్ర‌కాష్‌కు ఇచ్చాడు. దానితో కూర‌చేసుకుని తిన్న అత‌ని కుటుంబ స‌భ్యులు నితేష్, మనోజ్ కమలేష్, పింకీ, ఆర్తి  కొద్దిసేప‌టికే అనారోగ్యం పాల‌య్యారు. దీంతో వారు స్థానికుల స‌హాయా‌న్ని కోరారు. అలాగే ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. అక్క‌డున్న‌వారు వెంట‌నే పోలీసుల‌కు ఈ స‌మాచారాన్ని అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి, ఈ ఉదంతంపై ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-07-01T12:01:18+05:30 IST