వాట్సప్‌ యూనివర్శిటీలం

ABN , First Publish Date - 2021-07-22T08:38:46+05:30 IST

బతికున్నామో లేదో తెలియని అంతరాత్మలు సాయి స్టాన్‌ కరుణాకర్‌ల సాక్షిగా మనల్ని నిలదీస్తున్నాయ్‌...

వాట్సప్‌ యూనివర్శిటీలం

బతికున్నామో లేదో తెలియని అంతరాత్మలు

సాయి స్టాన్‌ కరుణాకర్‌ల సాక్షిగా

మనల్ని నిలదీస్తున్నాయ్‌

అన్నీ సక్రమంగా వుండీ

మీరేం చేస్తున్నారు...


అగాధాల్లో అడవుల్లో

అడుగుల కదలికలు ఆగలేదు

చావు వారి కెన్నడూ నెపం కాలేదు

బహుశా

వాళ్లు మనంత మేధావులు కారేమో


నెపం కరోన మీద నెట్టేసి

జూమ్‌ మీటింగులు ముఖపుస్తకాలు

గడపదాటని అధ్యయనాలు

అవిశ్రాంత మేధో కసరత్తులు


నిర్బంధం కొత్త కాదు వైరస్‌లు తప్ప

మరి ఏదీ అప్పటి కార్యాచరణ

కలం విదిలింపులకే పరిమితం

రేపటి చరిత్రలో

ఇప్పటి నువ్వొక దోషివే

ఆర్‌ కె (హైదరాబాద్)

Updated Date - 2021-07-22T08:38:46+05:30 IST