స్నేహితులకు తెలియకుండానే వాట్సాప్‌ స్టేటస్‌ చూడొచ్చు

ABN , First Publish Date - 2022-08-20T05:44:24+05:30 IST

వాట్సా్‌పలో స్టేటస్‌ పెట్టుకోవడం సర్వసాధారణం. కాంటాక్ట్‌లో ఉన్న అందరికీ అది కనిపిస్తుంది. పైపెచ్చు స్ట్టేట్‌సను ఎవరెవరు చూశారో కూడా తెలుసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తికి తెలియకుండానే వాట్సాప్‌ స్టేట్‌సను

స్నేహితులకు తెలియకుండానే వాట్సాప్‌ స్టేటస్‌ చూడొచ్చు

వాట్సా్‌పలో స్టేటస్‌ పెట్టుకోవడం సర్వసాధారణం. కాంటాక్ట్‌లో ఉన్న అందరికీ అది కనిపిస్తుంది. పైపెచ్చు స్ట్టేట్‌సను ఎవరెవరు చూశారో కూడా తెలుసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తికి తెలియకుండానే వాట్సాప్‌ స్టేట్‌సను చూడొచ్చు. అందుకు థర్డ్‌ పార్టీ యాప్‌ కూడా అవసరం లేదు. కొన్ని ట్రిక్స్‌ పాటించి ఆండ్రాయిడ్‌ అలాగే ఐఓఎస్‌ యూజర్లు రహస్యంగా స్టేటస్‌ చూడవచ్చు. అదెలాగంటే..


  • ఫోన్‌ లేదంటే ఐఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, అక్కడ మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అకౌంట్‌ ఆప్షన్‌ను పట్టుకోవాలి.
  • ప్రైవసీ దగ్గరకు వెళ్ళి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌పై దృష్టిసారించాలి. అక్కడ ‘రీడ్‌ రిసీట్స్‌’ ఫీచర్‌ను డిజేబుల్‌ చేస్తే సరిపోతుంది. 

ఫైల్‌ మేనేజర్‌తో స్టేటస్‌ చూడటం ఎలాగంటే...

  • ఫోన్‌లో ఫైల్‌ మేనేజర్‌ దగ్గరకు వెళ్ళాలి. 
  • ఇంటర్నల్‌ స్టోరేజీని ఓపెన్‌ చేసి వాట్సా్‌పపై క్లిక్‌ చేయాలి.
  • మీడియా ఫోల్డర్‌ను వెతికి పట్టుకోవాలి. ‘స్టేట్‌స’ని టాప్‌ చేయాలి.
  • కాంటాక్ట్‌ల నుంచి షేర్‌ అయిన వాట్సాప్‌ స్టేటస్‌ ఇమేజ్‌లు అన్నీ  కనిపిస్తాయి. 
  •  స్టేటస్‌ ఫోల్డర్‌ కనిపించనిపక్షంలో ఫైల్‌ మేనేజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ‘షో హిడెన్‌ ఫైల్స్‌’ని ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • మీ స్నేహితులకు తెలియకుండానే వారి వాట్సాప్‌  స్టేటస్‌లను చూసే అవకాశం లభిస్తుంది. 

Updated Date - 2022-08-20T05:44:24+05:30 IST