Whatsapp : సైలెంట్‌గా వాట్సప్ చేసిన మార్పు ఇదీ..

ABN , First Publish Date - 2022-08-06T00:35:44+05:30 IST

యూజర్లకు సులభమైన, ఉపయోగపడే ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే వాట్సప్(Whatsapp) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Whatsapp : సైలెంట్‌గా వాట్సప్ చేసిన మార్పు ఇదీ..

న్యూఢిల్లీ : యూజర్లకు సులభమైన, ఉపయోగపడే ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే వాట్సప్(Whatsapp) ఒక కీలక మార్పు చేసింది. ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్’ (Delete Messages For Everyone) ఆప్షన్ ద్వారా మెసేజీలను డిలీట్ చేసే సమయాన్ని 2 రోజుల వరకు  పొడిగించింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ని గతంలోనే ప్రకటించినా.. బెటా వెర్షన్ యూజర్లకు మాత్రమేనని చెప్పింది. కానీ ఎలాంటి ప్రకటనా చేయకుండానే వాట్సప్ యూజర్లందరికీ ఇటివల  అందుబాటులోకి తీసుకొచ్చింది.


కాగా గతంలో గంట వరకు మాత్రమే మెసేజీలను డిలీట్ చేసే అవకాశం ఉండేది. తాజా అప్‌డేట్‌తో 2 రోజుల వరకు మెసేజీలను డిలీట్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సప్ ఎలాంటి  ప్రకటనా చేయకపోవడం గమనార్హం. వాట్సప్ ఫ్యాక్(FAQ) పేజీ కూడా గంట వరకే ఆప్షన్ చూపిస్తోంది. కానీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరిశీలించగా 2 రోజుల వరకు డిలీట్ చేసుకునే అవకాశమున్నట్టు స్పష్టమైంది.

Updated Date - 2022-08-06T00:35:44+05:30 IST