వాట్సప్‌... ఒకేసారి నాలుగు డివైజ్‌లలో

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

వాట్సప్‌ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఈ మల్టీడివైజ్‌ ఫీచర్‌ను వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందకు వాట్సప్‌ ప్రయత్నాలు చేస్తోంది...

వాట్సప్‌... ఒకేసారి నాలుగు డివైజ్‌లలో

వాట్సప్‌ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఈ మల్టీడివైజ్‌ ఫీచర్‌ను వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందకు వాట్సప్‌ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మొబైల్‌తో పాటు వాట్సప్‌ వెబ్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పీసీలో కనెక్ట్‌ అయ్యే అవకాశం మాత్రమే ఉంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ ద్వారా నాలుగు డివైజ్‌లలో  వాట్సప్‌ అకౌంట్‌ను ఒకేసారి ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. వైఫై ద్వారా నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సప్‌ అకౌంట్‌కు కనెక్ట్‌ అవడం ద్వారా వాట్స్‌ప చూసే అవకాశం లభిస్తుంది.


Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST