‘వాట్సాప్‌ న్యూ పాలసీ’ మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2021-05-08T05:43:04+05:30 IST

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ ఈ ఏడాది తీసుకువచ్చిన కొత్త పాలసీ అమలును మళ్ళీ వాయిదా వేసింది. మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడం అలాగే సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి ఇతర యాప్‌లకు పలువురు వినియోగదారులు మళ్ళడంతో కొత్త పాలసీ అమలును మూడు నెలలు వాయిదా వేసింది.

‘వాట్సాప్‌ న్యూ పాలసీ’ మళ్లీ వాయిదా

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ ఈ ఏడాది  తీసుకువచ్చిన కొత్త పాలసీ అమలును మళ్ళీ వాయిదా వేసింది. మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడం అలాగే సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి ఇతర యాప్‌లకు పలువురు వినియోగదారులు మళ్ళడంతో కొత్త పాలసీ అమలును మూడు నెలలు వాయిదా వేసింది. మే 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసింది. ‘మే 15 నుంచి ఒక్క అకౌంట్‌నూ డిలీట్‌ చేయటం లేదు. ఇండియాలో ఏ ఒక్క వినియోగదారుడూ ఫంక్షనాలిటీని కోల్పోరు. రాబోయే వారాల్లోనూ రిమైండర్లతో కొత్త పాలసీపై అవగాహన కల్పిస్తామని సంబంధిత అధికార ప్రతినిధి ఒకరు ఈమెయిల్‌ ద్వారా స్పష్టం చేశారు. వాట్సాప్‌ కొత్త పాలసీని మెజారిటీ వినియోగదారులు అంగీకరించారని, ఇంకా కొంత మందికి ఆ అవకాశం రాలేదని సదరు ప్రతినిధి వివరించారు. కొత్త ఆప్షన్స్‌పై మరింత వివరణ ఇవ్వడమే కాకుండా ప్రజలతో బంధాన్ని పెంచుకోవడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టెలికాంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో, డేటా కన్జ్యూమింగ్‌లో ప్రథమస్థానంలో ఇండియా ఉంది. ఆ కారణంగా ఇండియా మార్కెట్‌ను వదులుకునేందుకు ఏ కంపెనీ సిద్ధంగా లేదు.


భారత ప్రభుత్వం అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతామని వాట్సాప్‌ పదేపదే స్పష్టం చేస్తోంది. వాస్తవానికి  ఈమధ్య కాలంలో పాలసీపై వినియోగదారులను ఎడ్యుకేట్‌ చేసే పని కొనసాగించింది. వాట్సా్‌పలో కొనసాగే సంభాషణలు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయని తెలియజేసింది. ఆ కారణంగా ప్రైవేటు సంభాషణలను వాట్సాప్‌ సహా వేరొకరు చదివే అవకాశం ఉండదని పదేపదే నొక్కి వక్కాణించింది. సాధారణ వినియోగదారులకు సంబంధించి మార్పులు ఏమీ లేవని, వాట్సా్‌పతో వ్యాపారాలు చేసేవారికే నిబంధనలను స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-08T05:43:04+05:30 IST