Whatsapp: వాట్సాప్‌లో త్వరలో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందే ఆప్షన్.. అదెలా అంటే..

ABN , First Publish Date - 2022-08-17T22:58:08+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కమ్యూనికేషన్ కోసం విరివిగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్ (WhatsApp). వ్యక్తిగతంగా ఒకరితో మరొకరు సంభాషించుకునే..

Whatsapp: వాట్సాప్‌లో త్వరలో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందే ఆప్షన్.. అదెలా అంటే..

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కమ్యూనికేషన్ కోసం విరివిగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్ (WhatsApp). వ్యక్తిగతంగా ఒకరితో మరొకరు సంభాషించుకునే ఈ మెసెంజింగ్ యాప్‌లో (Messaging App) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ అప్‌డేట్ చేస్తూ వాట్సాప్ యూజర్లకు (WhatsApp Users) మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా.. వాట్సాప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు తెలిసింది.


వాట్సాప్‌లో పొరపాటున మనం ఒక మెసేజ్ డిలీట్ (Whatsapp Message Delete) చేస్తే మళ్లీ ఆ మెసేజ్ మనం కావాలనుకుంటే రికవరీ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం లేదు. త్వరలో డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి పొందే ఆప్షన్‌ను (whatsapp message delete recovery) అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ ఉన్నట్లు కనిపించడంతో టెస్టింగ్ దశలో ఉందన్న విషయం తెలిసింది. Wabetainfo ప్రకారం.. వాట్సాప్ డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేందుకు యూజర్లకు Undo Button అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీటా టెస్టర్స్‌కే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.



అంతేకాదు.. మరో ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా వాట్సాప్ ప్రయత్నిస్తోంది. అదేంటంటే.. Unknown Users మన ఫోన్ నంబర్ తెలుసుకునే అవకాశం లేకుండా నంబర్‌ను Hide చేసే ఫీచర్‌పై కూడా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాట్సాప్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుండే Wabetainfo ఈ విషయాన్ని బయటపెట్టింది.


WhatsApp beta version 2.22.17.23, బీటా టెస్టర్స్‌కు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ పొందే యాక్సెస్‌ను వాట్సాప్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. iOS beta testers కూడా రానున్న రోజుల్లో ఈ ఫీచర్స్‌ను పొందే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇలా మన నంబర్‌ను కనిపించకుండా చేసే అవకాశం వాట్సాప్‌ గ్రూప్‌లో మాత్రమే ఉండనుంది. అడ్మిన్లకు తప్ప మిగిలిన గ్రూప్ సభ్యులకు మన నంబర్‌ను కనిపించకుండా చేసే ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-08-17T22:58:08+05:30 IST