Whatsapp: సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు.. ఇది అందుబాటులోకి వచ్చిందంటే మాత్రం..

ABN , First Publish Date - 2022-08-08T21:49:29+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగిస్తున్న మెసెంజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp). వ్యక్తిగత సంభాషణలకు వేదికైన ఈ యాప్‌ను కూడా..

Whatsapp: సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు.. ఇది అందుబాటులోకి వచ్చిందంటే మాత్రం..

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగిస్తున్న మెసెంజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp). వ్యక్తిగత సంభాషణలకు వేదికైన ఈ యాప్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేస్తుంటారు. దీంతో.. వాట్సాప్ ఎప్పటికప్పుడు సెక్యురిటీ ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ, హ్యాకర్ల నుంచి యూజర్ల డేటాను కాపాడేందుకు సరికొత్త సెక్యురిటీ ఫీచర్లను డెవలప్ చేస్తూ ఉంటుంది. ఆ చర్యల్లో భాగంగానే వాట్సాప్ ఇప్పుడు ఓ ఫీచర్‌పై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వాట్సాప్ కూడా ఇన్‌స్టాగ్రాం మాదిరిగా ‘లాగిన్ అప్రూవల్ ఫీచర్’ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే.. ఎవరైనా హ్యాకర్లు మీ వాట్సాప్‌లో కొత్త డివైజ్‌లో లాగిన్ అవ్వాలని చూస్తే.. మీ ఫోన్‌కు వెంటనే ‘లాగిన్ అప్రూవల్’ కోరుతూ కన్ఫార్మ్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది. ఆ కొత్త డివైజ్‌లో లాగిన్ అయింది మీరు కాని పక్షంలో.. వెంటనే ‘No’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే మీ వాట్సాప్‌ను యాక్సెస్ చేసే అవకాశం హ్యాకర్లకు ఉండదు.



ఈ ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోందన్న విషయాన్ని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo తొలిగా బయటపెట్టింది. యూజర్ల వ్యక్తిగత డేటాపై మరింత భద్రత కల్పించేందుకు వాట్సాప్ ఈ దిశగా అడుగులేస్తోందని తెలిపింది. అంతేకాదు.. వాట్సాప్‌లో గ్రూప్ అడ్మిన్స్‌గా ఉండేవారికి గ్రూప్‌పై మరింత నియంత్రణ వారి చేతుల్లో ఉంచేందుకు.. త్వరలోనే గ్రూప్‌లోని సభ్యులు పోస్ట్ చేసిన సందేశాలను కూడా గ్రూప్ అడ్మిన్లు డిలీట్ చేసే ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆప్షన్ వల్ల గ్రూప్‌లో సభ్యులు తెలిసీతెలియకో, ఉద్దేశపూర్వకంగానో, దురుద్దేశపూర్వకంగానో చేసే పోస్ట్‌లను బాధ్యత కలిగిన వ్యక్తి అడ్మిన్‌గా ఉంటే డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం beta testers కు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.

Updated Date - 2022-08-08T21:49:29+05:30 IST