వాట్సాప్‌, ఎఫ్‌బీకి జిహాదీలు గుడ్‌బై..!

ABN , First Publish Date - 2021-01-25T07:31:29+05:30 IST

దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త పాలసీ, కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో ఫేస్‌బుక్‌ ప్రభ తగ్గిన నేపథ్యంలో.. జిహాదీ గ్రూపులు కొత్త మెసేజింగ్‌

వాట్సాప్‌, ఎఫ్‌బీకి జిహాదీలు గుడ్‌బై..!

శ్రీనగర్‌, జనవరి 24: దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త పాలసీ, కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో ఫేస్‌బుక్‌ ప్రభ తగ్గిన నేపథ్యంలో.. జిహాదీ గ్రూపులు కొత్త మెసేజింగ్‌ యాప్‌లను వాడుతున్నాయా? జమ్మూకశ్మీర్‌లో కేవలం 2జీ సేవలే అందుబాటులో ఉండడంతో.. అందుకు అనుగుణమైన యాప్‌లను ఎంచుకున్నాయా? ఈ ప్రశ్నలకు భారత సైన్యం అవుననే అంటోంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల వద్ద లభించిన మొబైల్‌ ఫోన్లు, లొంగిపోయిన జిహాదీల వద్ద సీజ్‌ చేసిన సెల్‌ఫోన్లను విశ్లేషించగా.. ఈ విషయం నిర్ధారణ అయ్యింది. వాట్సా్‌పకు పోటీగా ఎదుగుతున్న మెసేజింగ్‌ యాప్‌లలో టర్కీకి చెందిన అప్లికేషన్‌ ముందంజలో ఉంది. ఈ యాప్‌తో పాటు.. అమెరికా, ఐరోపా కంపెనీలు అభివృద్ధి చేసిన యాప్‌లను జిహాదీ గ్రూపులు వాడుతున్నాయి. భద్రత కారణాల రీత్యా ఆ యాప్‌ల పేర్లను వెల్లడించలేదు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద రిక్రూట్‌మెంట్లు, పేలుళ్ల కుట్రలకు పాక్‌లోని ఓ టెలికాం ఆపరేటర్‌ అందజేసే వర్చువల్‌ మొబైల్‌ నంబర్‌ సేవలను జిహాదీ గ్రూపులు వాడుతున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 

Updated Date - 2021-01-25T07:31:29+05:30 IST