వాట్సాప్‌లో కొత్త ఫీచర్. ఇక కంప్యూటర్‌లో కూడా..

ABN , First Publish Date - 2021-08-12T01:15:24+05:30 IST

కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను స్టిక్కర్లు, ఏమోజీ, క్రాప్ చేసి పంపవచ్చ. అంతే కాకుండా ఫొటోపై ఏదైనా టెక్స్ట్ రాయాలనుకున్నా కూడా ఈ కొత్త ఫీచర్‌తో వీలవుతుంది. ఇప్పటికే పలువురు యూజర్లకి అందుబాటులోకి

వాట్సాప్‌లో కొత్త ఫీచర్. ఇక కంప్యూటర్‌లో కూడా..

న్యూఢిల్లీ: టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వినియోగదారులను ఆకట్టుకునే ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ అయిన వాట్సాప్.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆప్‌కు మాత్రమే పరిమితమైన ఫొటో ఎడిటింగ్ ఆప్షన్‌ను ఇకపై వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లకు కూడా వర్తించేలా ఈ కొత్త ఫీచర్ పని చేస్తుంది. గతంలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండేంది. ‘డ్రాయింగ్ టూల్’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం రూపొందించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.


కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను స్టిక్కర్లు, ఏమోజీ, క్రాప్ చేసి పంపవచ్చ. అంతే కాకుండా ఫొటోపై ఏదైనా టెక్స్ట్ రాయాలనుకున్నా కూడా ఈ కొత్త ఫీచర్‌తో వీలవుతుంది. ఇప్పటికే పలువురు యూజర్లకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యూజర్లందరికీ దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం తన బ్లాగ్‌లో పేర్కొంది.

Updated Date - 2021-08-12T01:15:24+05:30 IST