Abn logo
Oct 1 2020 @ 01:06AM

నా తప్పు ఏమున్నదబ్బా!

Kaakateeya

ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్‌ ‘బ్లాక్‌ రోజ్‌’. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంపత్‌ నంది సృష్టికర్త. చిత్రంలో మణిశర్మ సంగీతమందించిన ‘నా తప్పు ఏమునదబ్బా’ పాటను బుధవారం విడుదల చేశారు. దీన్ని తెలుగులో సంపత్‌ నంది రాయగా, హిందీలో వనితా గుప్తా రాశారు. రెండు భాషల్లోనూ హారికా నారాయణ్‌ పాడారు. ‘‘అల్లు అర్జున్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఊర్వశీ రౌతేలా ఈ పాటలో డ్యాన్స్‌ చేశారు. రిహార్సల్స్‌లో పలుమార్లు గాయపడినా కష్టపడి నేర్చుకున్నారు’’ అన్నారు నిర్మాత. ‘‘నటిగా నాలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో గాయాలైనా పాట చూసినప్పుడు ఆ కష్టం మర్చిపోయా’’ అని ఊర్వశీ రౌతేలా చెప్పారు. షేక్‌ స్పియర్‌ ‘మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’లో షైలాక్‌ పాత్ర ఆధారంగా మహిళా ప్రాధాన్య చిత్రంగా మలిచినట్టు సంపత్‌ నంది తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement