మెడ్ టెక్ జోన్ వెనుక అసలు కథేంటి?

ABN , First Publish Date - 2020-04-09T02:22:47+05:30 IST

మెడ్ టెక్ జోన్ భాగంగా దేశంలో పలు ఫార్మా ఉపకరణాలను తయారు చేసే కంపెనీలను ఆహ్వానించి వారికి స్థలాలు కేటాయించి..

మెడ్ టెక్ జోన్ వెనుక అసలు కథేంటి?

విశాఖ: మెడ్ టెక్ జోన్ భాగంగా దేశంలో పలు ఫార్మా ఉపకరణాలను తయారు చేసే కంపెనీలను ఆహ్వానించి వారికి స్థలాలు కేటాయించి, పలు రాయితీలు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహాన్ని అందించారు. దేశంలోని పలు కంపెనీలు కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన రాయితీలకు ఆకర్షితులై విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకోసం పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మెడ్‌టెక్ జోన్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేశాయి. కొంతమంది ఉత్పత్తులను సైతం ప్రారంభించారు. 2016 ఆగస్టు 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌కు శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ 13వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ మెడ్‌టెక్ జోన్‌ను ప్రారంభోత్సవం చేశారు. మెడ్‌టెక్ జోన్‌కు కేంద్రప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఫార్మా రంగంలో విశేష అనుభవం ఉన్న జితేంద్ర శర్మను సీఈవోగా నియమించారు.


ఇదే సమయంలో మెడ్‌టెక్ జోన్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం విచారణ నిర్వహించి ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడ్‌టెక్ జోన్‌లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. కొన్ని కంపెనీలు మెడ్ టెక్ జోన్‌ను వదిలివెళ్లిపోయాయి. ప్రభుత్వం జితేంద్రను ఆ పదవి నుంచి తొలగించింది. దీంతో మెడ్ టెక్ జోన్ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఇటీవల ప్రభుత్వంపై ఎవరి ఒత్తిడి వచ్చిందో తెలియదు గానీ జితేంద్రవర్మనే నియమించారు. జిగేంద్రను మళ్లీ నియమించడం వెనుక కేంద్రం ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మెడ్ టెక్ జోన్‌లో కంపెనీలు వెళ్లిపోవడం నిజమేనని గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసిన పూనం మాలకొండయ్య అంగీకరించారు. 


Updated Date - 2020-04-09T02:22:47+05:30 IST