పరగడుపున నెయ్యి తింటే.. ఏమవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-08T17:41:21+05:30 IST

నెయ్యి తినాలంటే కాస్త వెనకా, ముందూ ఆలోచిస్తాం. కోరి కొవ్వుతో బరువు పెంచుకోవడం ఎందుకనేది మన ఆలోచన. కానీ నిజానికి నెయ్యిని పరగడుపున కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఇలా చెప్తోంది.

పరగడుపున నెయ్యి తింటే.. ఏమవుతుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(08-03-2022)

నెయ్యి తినాలంటే కాస్త వెనకా, ముందూ ఆలోచిస్తాం. కోరి కొవ్వుతో బరువు పెంచుకోవడం ఎందుకనేది మన ఆలోచన. కానీ నిజానికి నెయ్యిని పరగడుపున కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఇలా చెప్తోంది.

భోజన రుచిని పెంచే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. లెక్కలేనన్ని ఔషధ ప్రయోజనాలూ దాగి ఉంటాయి. నెయ్యితో చిన్న పేగుల శోషణ శక్తి పెరగడంతో పాటు, ఆహార నాళంలోని ఆమ్లత్వం పిహెచ్ తగ్గుతుంది. అస్తవ్యస్థ ఆహారశైలి, నిద్రలేమి, కదలకుండా ఎక్కువసేపు కూర్చుని ఉండే జీవనశైలి, యాంటీబయాటిక్స్ వాడకం మూలంగా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాటి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవాలంటే, అందుకు తోడ్పడే నెయ్యిని పరగడుపున తినాలి. ఇందుకోసం ఉదయాన్నే పరగడుపున ఒక టీ స్పూను స్వచ్ఛమైన నెయ్యిని క్రమం తప్పక తినాలి. 

ఆరోగ్య ప్రయోజనాలు...

జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

చర్మం కాంతివంతమవుతుంది.

మలమూత్ర విసర్జనలు గాడినపడతాయి.

ఆకలి అదుపులో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గుతాం.

పేగులకు మేలు చేసే ఎంజైమ్స్ నెయ్యిలో ఉంటాయి. 

కాబట్టి పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ఎముకలు ధృఢంగా మారతాయి.

Updated Date - 2022-03-08T17:41:21+05:30 IST