బాదం పప్పును పొట్టుతో తింటే ఏమవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-22T17:18:19+05:30 IST

సాధారణంగా బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తింటాం. నిజానికి పొట్టుతో పాటు వేయించి లేదా పచ్చిగానే తినేవాళ్లూ ఉంటారు. కానీ బాదం పప్పును పొట్టు తొలగించి తినడమే

బాదం పప్పును పొట్టుతో తింటే ఏమవుతుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(22-03-2022)

సాధారణంగా బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తింటాం. నిజానికి పొట్టుతో పాటు వేయించి లేదా పచ్చిగానే తినేవాళ్లూ ఉంటారు. కానీ బాదం పప్పును పొట్టు తొలగించి తినడమే ఉత్తమం. బాదం పప్పు తొక్కులో ఉండే టానిన్లు, పోషకాల శోషణకు అడ్డు పడతాయి. బాదం పప్పును నానబెట్టడం వల్ల వాటి నుంచి, శరీరంలోని కొవ్వును కరిగించే లైపేజ్‌ అనే ఎంజైమ్‌ విడుదలవుతుంది. కాబట్టి పోషకాల శోషణ మెరుగ్గా జరగడంతో పాటు, అధిక బరువు తగ్గాలనుకుంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తినాలి. 

Updated Date - 2022-03-22T17:18:19+05:30 IST