Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 31 Dec 2021 18:30:23 IST

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు..

twitter-iconwatsapp-iconfb-icon

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక.. మనుషుల మధ్య దూరం చాలా దగ్గింది. ఎంత దూరంలో ఉన్నా ఒక్క క్లిక్‌తో హాయ్.. అంటూ ప్రత్యక్షమవుతుంటారు. అయితే ఈ మార్పుల వల్ల ఎంత ప్రయోజనం ఉందో.. అంతే నష్టం కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా.. అనుకుంటూ మోసగాళ్లు పొంచి ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అకౌంట్‌లోని నగదును ఖాళీ చేసేస్తారు. కేరళలో ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. ఓ రోజు ఇంటికి పిలిచింది. అయితే తర్వాత ఆమె చేసిన నిర్వాకానికి ఆ యువకుడు షాక్ అయ్యాడు... వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు.. ప్రతీకాత్మక చిత్రం

కేరళలోని త్రిసూర్‌లో సింధు(37) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు ఫిబ్రవరిలో పాలక్కాడ్ చంద్రనగర్‌కు చెందిన ఓ యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. రోజూ చాటింగ్, వీడియో కాల్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ఓరోజు యువకుడని  త్రిసూర్‌లోని తన ఇంటికి పిలిచింది. దీంతో యువకుడు ఏమాత్రం ఆలోచించకుండా.. వెంటనే ఆమె ఇంట్లో వాలిపోయాడు. తర్వాత ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఆమె నిజస్వరూపం బయటపడింది.

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..

ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేస్తున్నా అంటూ బెదిరించింది. ఒంటి మీదున్న బంగారు, ఉంగరాలు ఇవ్వాలని.. లేదంటే తనను లైంగికంగా వేధిస్తున్నావని పోలీసుకు చెబుతా అంటూ ప్లేట్ మార్చింది. పరువు పోతుందనే భయంతో ఆ యువకుడు.. తన బంగారం మొత్తం ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మళ్లీ అతడికి ఫోన్ చేసి.. ‘‘ నన్ను క్షమించు, నేను కావాలని అలా చేయలేదు.. డైరెక్ట్‌గా కలిస్తే బంగారు ఇవ్వడంతో పాటూ అసలు విషయం మొత్తం చెబుతా’’.. అంటూ నమ్మించింది. మరోసారి ఆమె మాటలు నమ్మిన యువకుడు మళ్లీ ఓ లాడ్జిలో ఆమెను కలుసుకున్నాడు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

అక్కడ అతనికి మాయమాటలు చెబుతూ నగ్నంగా మార్చింది. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. తర్వాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ వీడియోలు అందరికీ పంపుతా అంటూ బెదిరించి.. రూ.1,75,000లు రాబట్టింది. అంతటితో ఆగకుండా మరో రూ.పది లక్షలు డిమాండ్ చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు త్రిసూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ద్వారా మహిళకు ఫోన్ చేయించిన పోలీసులు.. ఆమె అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే.. మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..videoఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.