INDIAలో మొదటి వికలాంగుల చట్టం ఏది? TET కోసం..!

ABN , First Publish Date - 2022-05-05T18:58:14+05:30 IST

డన్‌ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. ప్రతిభావంతులు, బోధించగల బుద్దిమాంద్యులు, శిక్షణ ఇవ్వగల బుద్దిమాంద్యులు, సాంఘిక సంయోజనం లోపించినవారు, భావోద్రేకం లోపించినవారు, బధిరులు, కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, దృష్టి లోపం గలవారు, కొద్దిపాటి దృష్టిలోపం గలవారు, అంగవైకల్యం గలవారు, దీర్ఘకాలిక అనారోగ్యం గలవారు, భాషణ లోపం గలవారు.

INDIAలో మొదటి వికలాంగుల చట్టం ఏది? TET కోసం..!

డన్‌ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. ప్రతిభావంతులు, బోధించగల బుద్దిమాంద్యులు, శిక్షణ ఇవ్వగల బుద్దిమాంద్యులు, సాంఘిక సంయోజనం లోపించినవారు, భావోద్రేకం లోపించినవారు, బధిరులు, కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, దృష్టి లోపం గలవారు, కొద్దిపాటి దృష్టిలోపం గలవారు, అంగవైకల్యం గలవారు, దీర్ఘకాలిక అనారోగ్యం గలవారు, భాషణ లోపం గలవారు.


ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య 

సాధారణ విద్యార్థులు సహా సగటు విద్యార్థుల నుంచి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపరచి బోధించే విద్యను ‘ప్రత్యేక విద్య’ అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారు. వీరి అభిరుచులు, శక్తి సామర్థ్యాలు, లక్షణాలు భిన్నంగా ఉంటాయి. వీరికి విద్య సంబంధిత అవసరాలు తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి, సాంఘికీకరణకు తోడ్పడి పునరావాసం కల్పించేందుకు దోహదం చేసే విద్యను ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య’ అంటారు. దీని అధ్యయనంలో భాగంగా కొన్ని ప్రత్యేక పదాల గురించి తెలుసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1976లో ఈ పదాలను నిర్వచించింది.


బలహీనత: అనువంశిక కారణాల వల్ల గానీ, పరిసరాల వల్ల గానీ శరీర నిర్మాణం, రూపం, శారీరక భాగాల్లో  తేడా; వాటి పనితీరులో అస్వాభావికమైన/ అపసామాన్యమైన లోపాలు ఉండటాన్ని బలహీనత అంటారు. ఈ వైకల్యం వల్ల శరీర భాగాల పనితీరులో అవరోధాలు ఏర్పడతాయి. 

వైకల్యం: ఏ శారీరక భాగంలో బలహీనత ఉంటుందో ఆ భాగం పనితీరులో, దాని వల్ల వ్యక్తుల మొత్తం పనితీరులో అశక్తులవడాన్ని వైకల్యం లేదా అసామర్థ్యం అంటారు. 

వికలాంగ/ ప్రతిబంధం: వైకల్యం, అసామర్థ్యాల ఫలితంగా వ్యక్తి ఎదుర్కొనే అననుకూల పరిస్థితులను ‘ప్రతిబంధం లేదా లోపం’ అంటారు. ఈ లోపం అనేది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులతో అననుకూలతను పొందడంలో పరస్పర చర్యలుగా ప్రతిబింబిస్తుంది. పైన పేర్కొన్న మూడు పదాల మధ్య అంగాంగిక నమూన మీద ఆధారపడ్డ కార్యాత్మక పరస్పర బంధం ఉంది. ఉదా:వ్యక్తికి కాలు లేకపోవడం అనేది బలహీనత;  కాలు లేనందున నడవలేకపోవడం వైకల్యం. దీనితో సమాజం ప్రత్యేకంగా చూడడం వికలాంగం. 


ప్రత్యేక విద్య ఆవశ్యకత

  • ‘కొఠారి కమిషన్‌ ప్రకారం ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి.’ 
  • అందరికీ విద్య అనే నినాదం ప్రకారం ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అవసరం’. 
  • 6 - 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 వివరిస్తుంది. 
  • అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలంటే ప్రత్యేక విద్య అవసరం.
  • ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజానికి అంతో ఇంతో సహాయం చేస్తారు. 
  • ఉదా: దృష్టి లోపం ఉన్న లూయి బ్రెయిల్‌, పలు  వైకల్యాలు ఉన్న హెలెన్‌ కెల్లర్‌

ప్రత్యేక విద్య స్వభావం

  • ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన పద్దతుల్లో తేడా ఉంటుంది. వీరికి ప్రత్యేక బోధన విధానాలు ఉంటాయి. ఉదా: బ్రెయిల్‌ లిపి
  • ఈ పిల్లల విద్యకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ఈ పిల్లలకు ‘ఆరోగ్య పరీక్షలు’, మనోవిజ్ఞాన పరీక్షలు వంటి మూల్యాంకన సాధనాలు ఉంటాయి. 

ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ: డన్‌ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. ప్రతిభావంతులు, బోధించగల బుద్దిమాంద్యులు, శిక్షణ ఇవ్వగల బుద్దిమాంద్యులు, సాంఘిక సంయోజనం లోపించినవారు, భావోద్రేకం లోపించినవారు, బధిరులు, కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, దృష్టి లోపం గలవారు, కొద్దిపాటి దృష్టిలోపం గలవారు, అంగవైకల్యం గలవారు, దీర్ఘకాలిక అనారోగ్యం గలవారు, భాషణ లోపం గలవారు.


పీడబ్ల్యూడీ 1995: ఇది భారతదేశంలో మొదటి వికలాంగుల చట్టం. 1955లో పార్లమెంట్‌ ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది 1996 ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వికాలాంగులను ఏడు రకాలుగా వర్గీకరించింది. అంథత్వం, కొద్దిపాటి దృష్టి లోపం, కుష్టువ్యాధి, వినికిడి లోపం, మానసిక అనారోగ్యం, చలన/ అంగవైకల్యం, మానసిక వైకల్యం 


ఆర్‌పీడబ్ల్యూడీ 2016

  • 1995 పీడబ్ల్యూడీ యాక్ట్‌ స్థానంలో భారత పార్లమెంట్‌ ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రావడానికి కింది పరిస్థితులు దోహదం చేశాయి. 
  • 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషనల్‌ మిలీనియం డిక్లరేషన్‌ (యూఎన్‌ఎండీ)ను రూపొందించారు. దీని ప్రకారం 2015 నాటికి ప్రపంచ దేశాలన్నీ 100 శాతం వరకూ 14 ఏళ్లలోపు పిల్లల విద్యని సాధించాలని(వికలాంగులు కూడా) నిర్ణయించారు. ఈ డిక్లరేషన్‌ని భారత్‌ ఆమోదించింది. 
  • 2006లో ఐక్యరాజ్యసమితి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఓ కాన్ఫరెన్స్‌ నిర్వహించి డిక్లరేషన్‌ ప్రకటించింది. దీనినే యూఎన్‌సీఆర్‌పీడబ్ల్యూడీ అంటారు. ఈ డిక్లరేషన్‌లో వికలాంగుల హక్కుల గురించి పేర్కొన్నారు.
  • దీనికి అనుగుణంగా 2016లో భారత పార్లమెంట్‌ ఈ చట్టాన్ని రూపొందించింది. 2016 డిసెంబరు 30 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనితో వికలాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4 శాతానికి పెంచారు. ఈ చట్టం వికలాంగులను 21 రకాలుగా వర్గీకరించింది. అంథత్వం, కుష్టు, దృష్టిలోపం, వినికిడి లోపం, చలన వైకల్యం, మరగుజ్జుతనం, బుద్దిహీనత, మానసిక సమస్యలు, ఆటిజం, సెరిబ్రల్‌ టిస్టోపీ, మస్క్యులర్‌ టిస్టోపి, నాడీ సంబంధిత సమస్యలు,  స్పెసిఫిక్‌  లెర్నింగ్‌ డిజెబిలిటీ, మల్టిపుల్‌ స్టెరోసిన్‌, తలసేమియ, మాట్లాడలేకపోవడం, హిమోఫీలియా, సికెల్‌ సెల్‌ డిసీజ్‌, మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌, యాసిడ్‌ దాడి బాధితులు, పార్కిన్‌సన్‌ బాధితులు.


ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య నమూనాలు

  • ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం ప్రపంచ వ్యాప్తంగా మూడు నమూనాలు ఉన్నాయి. అవి సమైక్య విద్య, ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్య.  
  • సమైక్య విద్య: లోపాలు ఉన్న విద్యార్థులకు కొన్ని రోజులు ప్రత్యేకంగా బోధించి వారు సాధారణ స్థాయికి చేరగానే సాధారణ తరగతిలో పిల్లలందరితో కలిపి బోధించడాన్ని సమైక్య విద్య అంటారు. 
  • ప్రత్యేక విద్య: లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్న బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడమే ప్రత్యేక విద్య. ఇది భిన్న సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధించి ఉంటుంది. 
  • ఉదా: అంధుల పాఠశాల, బధిరుల పాఠశాల
  • సమ్మిళిత విద్య: బలాలు, బలహీనతలతో సంబం ధం లేకుండా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సాధారణ పిల్లలు అందరూ కలసి ఒకే పాఠశాల సముదాయంలో భాగం కావడాన్ని విలీన విద్య, సమ్మిళిత విద్య, సహిత విద్య అంటారు.


పీడబ్ల్యూడీ 1995లోని ముఖ్యాంశాలు

  • ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు వరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసన వాతావరణం కల్పించి ఉచిత విద్యను అందించాలి.  
  • సాధారణ పాఠశాలలోనే చదువుకొనేలా వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలి. 
  • అయిదోతరగతి పూర్తిచేసి పై తరగతులకు వెళ్లలేనివారికి పార్ట్‌ టైం క్లాస్‌లు నిర్వహించాలి. 
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పుస్తకాలు, పరికరాలు ఉచితంగా ఇవ్వాలి. 
  • పాఠశాలలో వికలాంగుల విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా భవన నిర్మాణం చేపట్టాలి. 
  • వికలాంగ విద్యార్థుల ప్రయోజనార్థం పాఠ్యాంశాలను తగిన రీతిలో పునర్వ్యవస్థీకరించాలి. 
  • వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి.


సమ్మిళిత విద్య

  • సమ్మిళిత విద్య అనేది దాదాపు ప్రపంచదేశాలన్నింటిలో ప్రధాన చర్చనీయాంశమైంది. గత నలభై ఏళ్లుగా ఈ పిల్లలకు సంబంధించిన విద్య  మార్పులు చెందుతూ వస్తోంది. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం సమ్మిళిత విద్య అనేది మానవ హక్కు. ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుందని  క్రిస్టెన్‌సెన్‌ 1996లో తన అభిప్రాయాన్ని తెలిపారు.
  • లిప్‌స్కే, గార్నర్‌ కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. దీనినే యునెస్కో  తన ఖ్చిజూఝ్చుఽ్చ్ఛ్చ ఖ్ట్చ్ట్ఛిఝ్ఛుఽ్ట (1994)లో ఉద్ఘాటించింది. 1990లో థాయ్‌లాండ్‌లోని జామితియెన్‌ పట్టణంలో నిర్వహించిన అందరికి విద్య ప్రపంచ సదస్సు తరవాత 1994లో స్పెయిన్‌లోని సాలమాంకా నగరంలో 92 దేశాల ప్రభుత్వాలు, 25 అంతర్జాతీయ సంస్థల ప్రతినిథులు సమావేశమై ప్రత్యేక విద్యావసరాల సూత్రాలు, విధి విధానాలపై సాలమాంకా ప్రకటన విడుదల చేశారు. దీనిలో ‘శిశు కేంద్రీకృత బోధన విధానాలను అనుసరించి ప్రత్యేక విద్యావసరాలు ఉన్న పిల్లలకు సాధారణ పాఠశాలల్లోనే వారి అవసరాలు తీరే విధంగా విద్యావకాశాలు కల్పించాలి’ అని పేర్కొన్నారు. సాలమాంకా ప్రకటనను సమ్మిళిత విద్యలో  మాగ్నాకార్టాగా పరిగణిస్తారు. 1994 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిథి సభ కూడా సహిత విద్య ప్రాధాన్యాన్ని గుర్తించింది. 

-తీగల జాన్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Read more