పెద్దాసుపత్రికి దారేది?

ABN , First Publish Date - 2021-09-16T03:36:18+05:30 IST

ఏళ్లు గడస్తున్నా నిర్మాణం పూర్తికాని దుబ్బాక వందపడకల ఆస్పత్రికి మరో అడ్డంకి ఏర్పడింది..!

పెద్దాసుపత్రికి దారేది?
దుబ్బాకలోని వంద పడకల ఆస్పత్రికి వెళ్లే దారికి అడ్డంగా వేసిన కంచె

దుబ్బాక, సెప్టెంబరు 15 : ఏళ్లు గడస్తున్నా నిర్మాణం పూర్తికాని దుబ్బాక వందపడకల ఆస్పత్రికి మరో అడ్డంకి ఏర్పడింది..! సుమారు రూ.35కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి రహదారి సమస్య తలెత్తింది.  ఆసుపత్రి స్థల సేకరణ సమయంలో నాటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ నాయకుడు పల్లె రామస్వామి హబ్షీపూర్‌, దుబ్బాక నుంచి సుమారు 500 మీటర్ల వరకు 75ఫీట్ల రహదారి ఏర్పాటుకు స్థల యజమానులతో అంగీకారం పొందారు. అందుకు అనువుగా ఆసుపత్రి వరకు మట్టి రోడ్డును నిర్మించారు. సుమారు 50 గుంటల వరకు ఆయా స్థలాల యజమానులు దారి ఇవ్వడానికి అంగీకరించారు. ప్రస్తుతం ఆ రహదారి వెడల్పును 40 ఫీట్లకు కుదించారు. ఇటీవల ఆ దారిలో సిమెంట్‌ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఒక రైతు తన స్థలం నుంచి రహదారి ఇవ్వబోనని  కంచె వేయడంతో నెలరోజులుగా వివాదం నెలకొన్నది. ఆస్పత్రికి రహదారి సమస్య ఏర్పడి, అసంపూర్తి పనుల పూర్తికి ఆటంకం వాటిల్లింది.

Updated Date - 2021-09-16T03:36:18+05:30 IST