Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 13:16:24 IST

ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!

twitter-iconwatsapp-iconfb-icon
ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!

ఇంటర్‌ ఫలితాలు రెండు రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. దాని తరవాత ఎంచుకునేందుకు ఇప్పుడు ఎన్నో కెరీర్లు  ఉన్నాయి. నిజానికి లక్ష్యాలకు అనుగుణంగా కెరీర్‌ను  మలచుకునేందుకు ఇదే సరైన సమయం. ఎన్నెన్నో కోర్సులు, భిన్న వృత్తులు నేడు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రాధాన్యపరంగా ఇప్పటికీ మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ అగ్రస్థానంలో ఉంటున్నాయి. అదేవిధంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి వాటికే డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. అలాగే ఇప్పుడు సంప్రదాయ సబ్జెక్టులతోపాటు సరికొత్త విభాగాలు వస్తున్నాయి. మెడిసిన్‌ కాకుంటే ఫోరెన్సిక్‌ సైన్స్‌, నానో టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ వద్దనుకుంటే చార్టర్డ్‌ అకౌంటెన్సీ, అక్చూరియల్‌... ఇలా పలు రకాల కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో సంప్రదాయ బ్రాంచ్‌లను తోసిరాజని కంప్యూటర్‌ సైన్స్‌ అగ్రభాగానికి చేరింది.  ఈ నేపథ్యంలో  ఏయే విభాగాల వారికి ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయో అవగాహన ఏర్పడితే చాలు. అదనపు సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతుక్కోవచ్చు. 


సివిల్‌ ఏవియేషన్‌

భారతదేశంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్స్‌ అత్యున్నతమైన సంస్థ. ఇది దేశంలోని ఎయిర్‌పోర్టులకు సంబంధించిన చాలా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇక మన రాష్ట్రంలోని ఎంసెట్‌ ద్వారా ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చేసినవారు కూడా ఈ రంగంలోకి వెళ్లవచ్చు. ఇందులో ప్రధానంగా టెక్నికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డివిజన్‌, కమర్షియల్‌ డివిజన్‌ ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, ఫిట్టింగ్‌ మొదలు ఎగిరే ప్రక్రియ వరకు ఇంజనీరింగ్‌ విభాగం పనే. కమర్షియల్‌ విభాగంలో కార్గో, ప్యాసింజర్‌ విమానాల సేవలు ఉంటాయి. పైలెట్‌ ట్రెయినింగ్‌ను ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటికి ఫీజు లక్షల్లో ఉంటుంది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు, మెరిట్‌ ఆధారంగా ఇందులో చేర్చుకుంటారు. కంటిచూపు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చక్కగా ఉండాలి. 


కమర్షియల్‌ ఏవియేషన్‌, ఎయిర్‌పోర్ట్‌, టెక్నికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డివిజన్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, కమర్షియల్‌ ఆపరేషన్‌ డివిజన్‌లో ఉద్యోగాలు ఉంటాయి. హోదాను బట్టి వీటిల్లో వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు నెల వేతనాలు లభిస్తాయి. 


Colleges, Institutions and Universities

Some of the institutes offering aviation courses are as follows.

 • Indian Institute of Aeronautics, Delhi. 
 • Bharat institute of Aeronautics, Patna. Contact: 0612-2224160
 • Indian institute of Aeronautics science, Jamshedpur. 
 • Hindustan institute of Aeronautics, Bhopal. Contact: 0755-2748018
 • Indian institute of Aeronautical science, Kolkata. Contact: 033 4001 0114.
 • Flytech Aviation, PlotNo:24, Arunodaya Building, Paigah Colony, S.P Road, Secunderabad, Hyderabad-500006, Telangana, INDIA. Tel: (91)-040-66200000
 • Avalon aviation academy, aptech house, A/65, MIDC, Andheri (E), Mumbai- 400 093. 

క్యాబిన్‌ క్రూ

ప్రయాణికులు విమానంలో ఎక్కడానికి ముందు ప్రారంభం అయ్యే డ్యూటీ వారిని సురక్షితంగా చేర్చేంత వరకు కొనసాగుతుంది. సాధారణంగా వారానికి 30 వరకు పనిగంటలు ఉంటాయి. అయితే ఇతర ఉద్యోగుల్లా రోజుకు ఇన్ని గంటలు ఉండే అవకాశం ఉండదు. ఒకే రోజు 20 గంటలు కూడా పనిచేయాల్సి రావచ్చు. అయినా ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా చూసుకోవాలి. క్యాబిన్‌ క్రూలో చేరడానికి సాధారణంగా డిగ్రీని అర్హతగా పరిగణిస్తారు. వయసు 19-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కొన్ని ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఇంటర్‌ పాసైనవారికీ ఉద్యోగాలు ఇస్తాయి. అలాంటివారి వయసు 18-21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సాధారణంగా ఈ రంగంలో హోటెల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజం డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎయిర్‌ హోస్టె్‌సలకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఉంటుంది. ఫస్ట్‌ఎయిడ్‌ తదితరాలను నేర్పిస్తారు. ఇక్కడ పని చేయాలనుకునే వారికి హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. పెద్ద పెద్ద సంస్థలు ఎయిర్‌ హోస్టె్‌సలకు నెలకు 40000-60000 రూపాయలు  జీతాలుగా ఇస్తాయి. 


షిప్పింగ్‌ ఇండస్ట్రీ

కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు షిప్పింగ్‌, మర్చంట్‌ నేవీకి సంబంధించిన కోర్సుల్లో చేరవచ్చు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు, మెరిట్‌ ఆధారంగా ఇందులో చేర్చుకుంటారు. ఇందులో డిగ్రీ, డిప్లొమా కోర్సులు ఉంటాయి. కంటిచూపు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చక్కగా ఉండాలి. ప్రధానంగా రెండు రకాల కోర్సులు ఉంటాయి.       


 • షిప్పింగ్‌
 • మర్చంట్‌ నేవీ


ఏవియేషన్‌ ఇండస్ట్రీ

మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌తో ఇంటర్‌ పూర్తి చేసినవారు ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, సంబంధిత ఉద్యోగాలు చేయవచ్చు. సైన్సేతర రంగాలకు చెందిన విద్యార్థులు కమర్షియల్‌ ఏవియేషన్‌లోని క్యాబిన్‌ క్రూ, గ్రౌండ్‌ డ్యూటీ ఉద్యోగాలు ఎంచుకోవచ్చు. క్యాబిన్‌ క్రూ విషయంలో కొంత ఎగ్జయిట్‌మెంట్‌ ఉంటుంది. వివిధ దేశాలు తిరగడం, భిన్నమైన వ్యక్తులను కలుసుకోవడం వీరి ఉద్యోగంలో భాగం. 

ఏవియేషన్‌ కోర్సులను అందిస్తున్న కొన్ని సంస్థలు


 • Central training establishment, Hyderabad.
 • AHA (Air Hostess Academy), No. A1, Ring Road, Raja Garden Crossing, Lajpat Nagar, Delhi - 110024
 • Global institute, B-1/637, 1st Flr, Janakpuri, Delhi - 110058
 • Indian aviation academy, Office 7& 8, Rushabh Complex, Oshiwar Link Road, Andheri West, Mumbai - 400053, 
 • Sristys aviation, Sristy’s school of air hostess, 307, 3rd Flr, swarnajayanthi complex, ameerpet, Hyderabad.
 • Aptima air hostess academy, Block-J, Rajouri garden, New Delhi- 110 027, 
 • Free bird aviation & management services, TC-41/2454 mancaud, Trivandrum-9


మెరైన్‌ ఇంజనీరింగ్‌

ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల్లో మెరైన్‌ ఇంజనీరింగ్‌ కూడా ప్రత్యేకమైనది. సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తి చేసినవారు ఈ రంగంలోకి వెళ్లడానికి అర్హులు. ఐఐటీల్లో సీటు రావాలంటే  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు తెచ్చుకోవాల్సిందే. 

మెరైన్‌ ఇంజనీరింగ్‌ను అందిస్తున్న కాలేజీలు(ఐఐటీయేతర)

List of marine engineering colleges

 • T.S. Chanakya, karaus, New Mumbai- 400 706
 • Haldia Institute of Maritime Studies And Research  ICARE Complex, Marine Campus, P.O. Hatiberia,    HaldiaDist. Purba Medinipur, PIN – 721657, West Bengal. Phone Nos : 03224 267501 / 267502
 • RL Institute of Nautical Science, T.V.R Nagar Aruppukottai Road Elliyerpatti, Madurai, Tamil Nadu 6250224. Phone: 0452 391 8614
 • Marine Engineering Research Institute, P-19, Taratolla Rd, Kolkata-700088, Ph:033 2401 4675.
 • Marine Engineering& Research Institute, Hay Bunder Road, Mumbai-400033
 • Lal Bahadur Shastri College of Advanced Maritime Studies & Research, Hay Bunder Road, Mumbai, Maharashtra 400033. Ph:022 2371 9931 
 • International Marine Communication Centre, 134/3, R.H Road, near Luz Corner, Mylapore, Chennai-600004
 • The Calcutta Technical School, 110 SN Banerjee Road, Kolkatta - 700013
 • College Of Engineering (Andhra University), Waltair, Visakhapatnam-530003
 • Andhra University College of Engineering- Visakhapatnam, Andhra pradesh
 • White Shark Marine Institute-New Delhi, Delhi
 • Gujarat Technological University- Ahmedabad, Gujarat
 • Andhra University, Visakhapatnam, Andhra pradesh
 • Praveenya Institute Of Marine Engineering- Vizianagaram, Andhra pradesh
 • Institute Of Technology And Marine Engineering-24 Parganas (south), West Bengal
 • Coimbatore Marine College - Coimbatore, Tamil Nadu -      International Maritime Institute, Delhi
 • Maharashtra Academy of Naval Education & Training, Pune
 • Institute of Technology &Marine Engineering, Kolkata
 • Indian Meritime University, Chennai
 • Academy of Maritime Education & Training, Chennai
 • BP Marine Academy, Navi Mumbai
 • TS Rahaman, Mumbai
 • Tolani Maritime Institute, Pune
 • Samundra Institute if Maritime, Mumbai
 • Karnatak University     
 • Annamalai University
 • Mangalore University  l University of Chennai
 • Berhampur University

ఫిజికల్‌, కెమికల్‌ అండ్‌ ఎర్త్‌ సైంటిస్టులు 

ఇంజనీరింగ్‌ ద్వారా కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేయవచ్చు. బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమిస్ర్టీ చేసిన వారికి కూడా కెమికల్‌కు సంబంధించిన స్పెషలైజ్డ్‌ డిప్లొమాలు ఉన్నాయి. జేఎన్‌టీయూ, ఆంధ్రా, ఓయూలలో కొన్ని కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఫిజిక్స్‌, మేథ్స్‌లో కూడా ఇలాంటి కోర్సులు ఉన్నాయి. డిగ్రీ/పీజీల్లో జాగ్రఫీ సబ్జెక్టులు చదివిన వారు జియాలజిస్టులుగా వెళ్లవచ్చు. ఓషనోగ్రఫీకి సంబంధించిన కోర్సులు ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్నాయి. కెమికల్‌ ఇండస్ర్టీ, ఫిజిక్స్‌ అండ్‌ అలైడ్‌ ఫీల్డ్‌లో ఉపాధి ఉంటుంది. మేథమెటీషియన్స్‌ అండ్‌ స్టాటిస్టీషియన్స్‌, జియాలజిస్టులుగా, జాగ్రఫీ అండ్‌ జాగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ స్పెషలిస్టులుగా, మెట్రోలాజిస్టులుగా, ఓషనోగ్రాఫర్లుగా అవకాశాలుంటాయి.


ఆర్కిటెక్చర్‌ & కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ

మేథ్స్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు ఇందులో ఇంజనీరింగ్‌ చేయవచ్చు. టెన్త్‌ తరవాత పాలిటెక్నిక్‌ డిప్లొమా ఆధారంగా కూడా సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఆర్కిటెక్చర్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో ఉద్యోగాలుంటాయి.


ఫోరెన్సిక్‌ సైన్స్‌

 ఫోరెన్సిక్‌ అనేది లాటిన్‌ పదం. ఫోరెన్సిక్‌ సైన్స్‌ అనేది నేరాలను శాస్త్రీయంగా నిర్ధారించే శాస్త్రం. ఫిజికల్‌, మెడికల్‌, బయోలాజికల్‌, మెడికల్‌ తదితర సబ్జెక్టుల నుంచి పుట్టిన శాస్త్రం ఇది. మొదటిసారిగా భారత ప్రభుత్వం 1972లో న్యూఢిల్లీలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌సైన్స్‌ (www.nicfs.nic.in)ను ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు వేలాది మందికి ఫోరెన్సిక్‌ సైన్స్‌లో శిక్షణ ఇచ్చింది. వీరిలో ప్రపంచంలోని 200 దేశాలవారు ఉన్నారు. ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు కోల్‌కత్తా, హైదరాబాద్‌, చండీగఢ్‌లో ఫోరెన్సిక్‌ లేబొరేటరీలను ఏర్పాటు చేసింది. క్రిమినాలజీలో ఎంఏ, ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ కోర్సును ఎల్‌ఎన్‌జెపి- ఎన్‌ఐసిఎ్‌ఫఎస్‌ అందిస్తోంది. ఒక్కో దానిలో 20 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్‌ డాక్యుమెంటేషన్‌, ఫోరెన్సిక్‌ బాలిస్టిక్‌, ఫోరెన్సిక్‌ బయాలజీలతోపాటు కొన్ని షార్ట్‌టర్మ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సంబంధించి దేశంలోని పలు యూనివర్సిటీలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ కోర్సు ఉంది. ఏ డిగ్రీ చేసినవారైనా ఈ కోర్సులో చేరొచ్చు. అదేవిధంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గుజరాత్‌ ఫొరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (www.gfsu.edu.in)  కూడా ఉంది.

ఫోరెన్సిక్‌ కోర్సు అందించే కొన్ని సంస్థలు

 • Anna University (Chennai 600025) - Post-BE Diploma in Forensic Engineering
 • Bundelkhand University (Jhansi 284128)-PG Diploma in Forensic Science
 • PG Diploma in Criminology; University of Delhi (Delhi 110007)- Certificate in Forensic Science(3 months)
 • Dr. B.R. Ambedkar University(Agra 282004)-MSc(Forensic Science)
 • Dr.Hari Singh Gour Vishwavidyalay (Sagar 470003)-MSc. (Criminology), MA (Criminal and Forensic Science). 
 • Karnataka University (Dharwad-580003)-MA (Criminology and Forensic Science)
 • Lucknow University (Lucknow 226007)-PG Diploma in Forensic Anthropology
 • University of Madras (Chennai 600005)-MA (Criminology), and MSc. (Forensic Science)
 • Osmania University (Hyderabad 500007)-MSc. (Forensic Science Laboratory)
 • Panjab University(Chandigarh 160014)-PG Diploma in Forensic Science and Criminal Science. 
 • Punjabi University (Patiala 147002)-MSc(Forensic Science)
 • Amity University (Sector 44, Noida-UP) BSc. and MSc. (Forensic Science).

ఫ్లోరీ కల్చర్‌

కమర్షియల్‌గా పూల సాగు చేయడమే ఫ్లోరికల్చర్‌. తెగులును తట్టుకునే లా, ఎక్కువ పూలు పూసేలా మొక్కలను తయారు చేయడమే ఫ్లోరికల్చరిస్టుల పని. హార్టికల్చర్‌లో భాగంగా ఉన్న ఇది తరవాతి కాలంలో ప్రత్యేక విభాగంగా మారింది. బీఎస్సీ హార్టీకల్చర్‌/ అగ్రికల్చర్‌ను మన దేశంలో చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఎంసెట్‌లో మెరిట్‌ ద్వారా మన రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ప్రవేశం పొందవచ్చు. 

ఫ్లోరీ కల్చర్‌ను అందిస్తున్న కొన్ని సంస్థలు

 • National Botanical Research Institute, Rana Pratap Marg, P.B.No.436, Lucknow-226001, Uttar Pradesh
 • G.B Plant University of Agriculture & Technology, Pantnagar, Udhamsingh, Nagar-263145, Uttrakhand, Tel:05944-233671, Fax: 05944-233671, Fax: 05944-233473, Website:www.gbput.ac.in
 • Institute of Himalayan Bioresource Technology, Post Box No. 6, Palathpur-176061, Himachal Pradesh, Tel: 001894-230742-43, 01894-230433 E-mail:[email protected], Website:csir.res.in
ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!


ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.