ఏం అనుసరించాలి? ఏం తినాలి?

ABN , First Publish Date - 2021-05-18T05:10:14+05:30 IST

ఇమ్యూనిటీ పెంచడం, కండరాలను బలపరుచుకోవడం, పోషకాహారం తీసుకోవడం... కొవిడ్‌ బాధితులు ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలివి. పోషకాహారంలో భాగంగా కొవిడ్‌ బాధితులు అనుసరించవలసిన నియమాలు ఇవే

ఏం అనుసరించాలి? ఏం తినాలి?

ఇమ్యూనిటీ పెంచడం, కండరాలను బలపరుచుకోవడం, పోషకాహారం తీసుకోవడం... కొవిడ్‌ బాధితులు ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలివి. పోషకాహారంలో భాగంగా కొవిడ్‌ బాధితులు అనుసరించవలసిన నియమాలు ఇవే!

  • రాగులు, ఓట్స్‌, తోటకూర గింజలు ప్రతి రోజూ భోజనంలో ఉండేలా చూసుకోవాలి.
  • చికెన్‌, చేపలు, గుడ్లు, పన్నీర్‌, సోయా, నట్స్‌, సీడ్స్‌ తీసుకోవాలి.
  • వాల్‌నట్స్‌, బాదం, ఆలివ్‌ ఆయిల్‌, ఆవనూనె మొదలైన ఆరోగ్యవంతమైన కొవ్వులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
  • క్రమం తప్పని శారీరక వ్యాయామం (యోగా), శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు (ప్రాణాయామం) శక్తి మేరకు చేయాలి.
  • ఐదు రకాల పళ్లు, కూరగాయలు ప్రతి రోజూ భోజనంలో ఉండేలా చూసుకోవాలి.
  • రోజులో ఒక్కసారి పసుపు కలిపిన పాలు తాగితే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది.
  • రుచి కోల్పోవడం కొవిడ్‌ ప్రధాన లక్షణం కాబట్టి, రుచి కోసం వంటకాల్లో ఆమ్‌చూర్‌ కలుపుకోవచ్చు. 
  • గొంతు నొప్పి ఉన్నవాళ్లు తక్కువ వ్యవధితో, ఎక్కువ సార్లు మెత్తని పదార్థాలు తినడం మేలు!
  • కొవిడ్‌కు సంబంధించిన ఆందోళన తొలగడం కోసం 70ు కొకొ కలిగిన డార్క్‌ చాక్లెట్స్‌ స్వల్ప పరిమాణాల్లో తినవచ్చు.

Updated Date - 2021-05-18T05:10:14+05:30 IST