జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం తినాలి?

ABN , First Publish Date - 2021-07-17T20:38:30+05:30 IST

జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్యలతో పాటు మీరు అధిక బరువుతో కూడా ఉన్నట్టయితే అది హార్మోనుల వల్ల కావచ్చు. ముందుగా మీ లక్షణాలకు కారణాన్ని వైద్యుల సహాయంతో నిర్ధారించుకోవడం శ్రేయస్కరం. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో కొన్ని రకాల

జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం తినాలి?

ఆంధ్రజ్యోతి(17-07-2021)

ప్రశ్న: నాకు జుట్టు రాలే సమస్య ఉంది. ఈ మధ్య అవాంఛిత రోమాలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యలకు తగిన ఆహారం సూచించండి.

 

- మల్లిక, కామారెడ్డి


డాక్టర్ సమాధానం: జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్యలతో పాటు మీరు అధిక బరువుతో కూడా ఉన్నట్టయితే అది హార్మోనుల వల్ల కావచ్చు. ముందుగా మీ లక్షణాలకు కారణాన్ని వైద్యుల సహాయంతో నిర్ధారించుకోవడం శ్రేయస్కరం. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చికెన్‌, చేప, గుడ్లు లాంటివి తప్పకుండా తీసుకోండి. అలాగే, మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు కూడా ఎంతో అవసరం. వీటన్నిటిలో ఉన్న ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగడానికి అత్యవసరం. అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసెగింజలు మొదలైన వాటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కూడా మీ సమస్య నివారణకు కొంత వరకు ఉపయోగపడతాయి. ఆహారంలో జాగ్రత్తలతో పాటు, మీ జీవన విధానంలో ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర కూడా అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-17T20:38:30+05:30 IST