వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే..

ABN , First Publish Date - 2022-07-21T18:07:41+05:30 IST

వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తోడ్పడే హెయిర్‌ మాస్క్‌లను ఉపయోగిస్తుండాలి.

వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే..

వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తోడ్పడే హెయిర్‌ మాస్క్‌లను ఉపయోగిస్తుండాలి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 


పొడిజుట్టు కోసం: 

  • ఐదు చెంచాల శనగపిండి, పెరుగు, రెండు పెద్ద చెంచాల ఆలివ్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించాలి.
  • 20 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేసేయాలి.
  • కండిషనర్‌ వాడడం మర్చిపోకూడదు. శనగపిండి కుదుళ్లను బలపరిస్తే, ఆలివ్‌ ఆయిల్‌, పెరుగు జుట్టుకు మెరుపును అందిస్తాయి. జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా తయారవుతుంది. 


సాధారణ వెంట్రుకలకు: 

  • రెండు పెద్ద చెంచాల శనగపిండి, బాదం పొడులను గిన్నెలో కలుపుకోవాలి. 
  • ఈ మిశ్రమాన్ని కదుళ్లు, వెంట్రుకలకు పట్టించాలి.
  • అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి.


జిడ్డు వెంట్రుకలకు: 

  • రెండు పెద్ద చెంచాల శనగపిండి, మెంతులు, కొబ్బరిపాలలో నానబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి.
  • అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి.


పాడైన వెంట్రుకలకు: 

  • ఒక మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసుకోవాలి. 
  • దీన్లో నాలుగు చెంచాల కొబ్బరినూనె, ఒక చెంచా గ్లిజరిన్‌, రెండు చెంచాల తేనె చేర్చి కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే పాడైన వెంట్రుకలు బాగవుతాయి. 


జీవం కోల్పోయిన వెంట్రుకలకు: 

  • కలబంద గుజ్జు రెండు పెద్ద చెంచాలు తీసుకోవాలి. దీనికి రెండు పెద్ద చెంచాల సిలికాన్‌ లేని కండిషనర్‌ను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పూసుకుని, పెద్ద దంతాలు ఉన్న దువ్వెనతో వెంట్రుకలు అన్నింటికీ అంటుకునేలా దువ్వాలి.
  • 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. 

Updated Date - 2022-07-21T18:07:41+05:30 IST