Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలు ఎత్తు పెరగడం లేదా?

ఆంధ్రజ్యోతి(29-04-2021)

పిల్లలు తగినంత ఎత్తు పెరగకపోతే తల్లిదండ్రులు పడే ఆందోళన అంతాఇంతా కాదు. పిల్లలు సాధారణంగా యుక్తవయస్సు వచ్చే వరకు ఎత్తు పెరుగుతారు. కాబట్టి బాల్యం నుంచే తగినంత ఎత్తు పెరిగేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 


పిల్లలకు పాలు, పాల ఉత్పత్తులతో పాటు తాజా పండ్లు ఇవ్వాలి. పాలలో కాల్షియం ఉంటుంది. ఎసెన్షియల్‌ మినరల్స్‌ ఉంటాయి. ఇవి ఎముకల ఎదుగుదలకు బాగా ఉపకరిస్తాయి. పెరుగు, పనీర్‌, ఛీజ్‌ వంటివి కూడా రోజూ మెనూలో ఉండేలా చూడాలి.

పిల్లలు కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌, కేఫెన్‌ ఉన్న డ్రింక్స్‌ ఎక్కువగా తాగకుండా చూడాలి. వాటికి బదులుగా రోజూ నీళ్లు ఎక్కువగా తాగేలా చూడాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. టాక్సిన్స్‌ పోయి జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల బాగుంటుంది. 

పిల్లలు రోజూ తగినంత సమయం నిద్రపోయేలా చూడాలి. శరీరానికి సరిపడా నిద్ర లభించినప్పుడు పెరుగుదల ఉంటుంది. కణజాలానికి తగినంత రెస్ట్‌ లభించినపుడు శరీరంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది. 

పిల్లలు ఎక్కువ ఆటలు ఆడేలా చూడాలి. వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, స్విమ్మింగ్‌ వంటి ఆటలు ఆడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆట ఏదైనా ఫిజికల్‌ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే గ్రోత్‌ బాగుంటుంది. యోగాసనాలు కూడా పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగపడతాయి.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement