కోచింగ్ సెంటర్లో క్లాస్ పూర్తి.. బస్సు రాకపోవడంతో విసుగొచ్చి అటుగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని లిఫ్ట్ అడిగిందా బాలిక.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-23T23:46:06+05:30 IST

ఢిల్లీలో ఓ యువతి ఇంటికెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈలోగా ఓ యువకుడు అటుగా వచ్చి.. లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. పోలీసునని చెప్పడంతో అతడిని నమ్మి.. బైక్‌పై వెళ్లింది. ఆ తర్వాత..

కోచింగ్ సెంటర్లో క్లాస్ పూర్తి.. బస్సు రాకపోవడంతో విసుగొచ్చి అటుగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని లిఫ్ట్ అడిగిందా బాలిక.. ఆ తర్వాత..

పోలీసులంటే ప్రజలకు భరోసా కల్పించాలి. అందులోనూ మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ కొందరు పోలీసులు మాత్రం వారి వృత్తికే కలంకం తెస్తుంటారు. ఇలాంటి వారి వల్ల మొత్తం డిపార్ట్‌మెంట్ పైనే నమ్మకం పోయే పరిస్థితి వస్తోంది. విషయానికొస్తే.. ఢిల్లీలో ఓ యువతి ఇంటికెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈలోగా ఓ యువకుడు అటుగా వచ్చి.. లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. పోలీసునని చెప్పడంతో అతడిని నమ్మి.. బైక్‌పై వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


ఢిల్లీలోరి ఉత్తమ్‌నగర్‌కు చెందిన అభిషేక్‌ కుమార్‌(20).. సివిల్ డిఫెన్స్ పోలీసుగా పని చేస్తున్నాడు. వృత్తిలో అంకితభావంతో ఉండే అతడు.. అమ్మాయిల విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించేవాడు. ఓ రోజు విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన ఓ యువతి.. ఇంటికి వెళ్లేందుకు మటియాలా రోడ్డులో వేచి ఉంది. అటుగా వచ్చిన పోలీసు.. అమెను చూడగానే బండి ఆపాడు. తాను పోలీసునని, లిఫ్ట్ ఇస్తాననని చెప్పడంతో బాలిక నమ్మింది. పోలీసు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చని భావించింది. కానీ తర్వాత జరిగిన ఘటన ఆమెను షాక్‌కు గురిచేసింది.


బండిపై యువతిని ఎక్కించుకున్న అతను.. ఇంటికి కాకుండా నేరుగా పార్క్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అనుమానం వచ్చి.. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ ప్రశ్నించింది. పార్కులో చిన్న పనుందంటూ నమ్మించాడు. సందేహంలో ఉన్న బాలికను ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరవకుండా నోరు మూసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. బైకుపై బాలికను తీసుకెళ్తున్నట్లు ఓ ఫుటేజీలో గుర్తించారు. శనివారం రాజపురి ప్రాంతంలో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-11-23T23:46:06+05:30 IST