రెడీ‌మేడ్ షర్ట్ వెనుక లూప్ ఎందుకుంటుందో తెలుసా? దాని ఉపయోగం ఏమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-16T15:48:16+05:30 IST

షర్టుకు వెనుక భాగంలో చిన్న గుడ్డ లూప్..

రెడీ‌మేడ్ షర్ట్ వెనుక లూప్ ఎందుకుంటుందో తెలుసా? దాని ఉపయోగం ఏమిటో తెలిస్తే..

షర్టుకు వెనుక భాగంలో చిన్న గుడ్డ లూప్ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇది ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలోని కొన్ని సాధారణ విషయాల గురించి మనకు అంతగా తెలియదు. వాటి గురించి తెలుసుకున్నప్పుడు నోరెళ్లబెడతాం. ఉదాహరణకు మనం ధరించే షర్టునే తీసుకుందాం. ప్రతిరోజూ దీన్ని ధరిస్తాం! స్కూలుకో, కాలేజీకో, ఆఫీసుకో వెళ్తున్నప్పుడు ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకుని బయటికి వెళుతుంటాం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ షర్టును హ్యాంగర్‌కు వేలాడదీస్తుంటాం. 


హ్యాంగర్‌కు చొక్కా వేలాడదీయడం వల్ల దాని ఇస్త్రీ పాడవదు. అంటే చొక్కాపై ముడతలు పడవు. మీ షర్టు వెనుక భాగంలో ప్లీట్.. యోక్‌కి కలిసే చోట, ఒక చిన్న లూప్ ఉంటుంది. దీనిని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది దేనికి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఇంకా గమనించకపోతే, ఇప్పుడే చూడండి. ఇది డిజైన్ కాదు..  వార్డ్‌రోబ్‌లు లేని ఆ రోజుల్లో, ముడతలు పడకుండా చొక్కాలను వేలాడదీయడానికి ఈ లూప్‌లు ఉపయోగపడేవి. నేటికీ దాని ఉపయోగం తెలిసిన వారు ఆ విధంగానే వేలాడదీస్తారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ట్రెండ్ 1960 లలో US-తయారైన ఆక్స్‌ఫర్డ్ బటన్-డౌన్ షర్టులతో ప్రారంభమైంది. విపరీతమైన ప్రజాదరణ పొందింది. మేకర్స్ దీనికి 'లాకర్ లూప్' అని పేరు పెట్టారు. అయితే తరువాత దీనిని ఫెయిరీ లూప్, ఫాగ్ ట్యాగ్ లేదా ఫ్రూట్ లూప్ అని కూడా పిలిచారు. ఈ ట్రెండ్‌ని అనేక ఇతర బ్రాండ్‌లు కూడా అనుసరించాయి. ఇది ఇప్పటి వరకు కొనసాగుతోంది. వార్డ్‌రోబ్‌లు, హ్యాంగర్‌ల రాకతో ఈ లూప్ డిజైన్‌గా కనిపిస్తోంది. హ్యాంగర్ లేనప్పటికీ మీరు దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, హ్యాంగర్ లేనప్పుడు ఈ షర్టు క్లాత్ లూప్ సహాయంతో దానిని మేకుకు వేలాడదీయవచ్చు. ఇది మీ చొక్కాను మడతలు పడనీయకుండా కాపాడుతుంది. 

Updated Date - 2022-04-16T15:48:16+05:30 IST