Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. భార్యాభర్తల మధ్య మటన్ పంచాయితీ.. భార్య ఎటువైపు మొగ్గుతుందో మీకైనా తెలుసా..

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు కొన్ని ఇష్టాలను అసలు వదులుకోలేరు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక చివరకు తమ ఇష్టం ప్రకారమే వెళ్తుంటారు. అలాంటి ఇష్టాలు కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. న్యూఢిల్లీలో భార్యాభర్తల మధ్య జరిగిన ఓ పంచాయితీ చాలా విచిత్రంగా ఉంది. భార్యకు ఉన్న ఇష్టం.. చివరకు ఆమె సంసారంలోనే చిచ్చు పెట్టింది. భర్త మాట విని బుద్ధిగా సంసారం చేసుకుంటుందా.. లేక తన ఇష్ట ప్రకారమే వెళ్తుందా.. అనే విషయంలో ప్రస్తుతం అక్కడ చర్చ నడుస్తోంది..

న్యూఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. అందమైన అమ్మాయిని ప్రేమించాడు. అతడంటే ఆమెకు కూడా ఇష్టమే. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. అదేంటంటే.. భర్త కుటుంబం మొత్తం శాఖాహారులు. అలాగే భార్య కుటుంబం మొత్తం కూడా శాఖాహారులే. అయితే భార్య మాత్రం పెళ్లికి ముందు ఓ సారి స్నేహితులతో కలిసి మటన్ ముక్క రుచి చూసింది. అప్పటినుంచి ఆ రుచికి ఫిదా అయిపోయింది. ఇంట్లో తెలిస్తే తిడతారని, బయటికెళ్లినప్పుడు దొంగచాటుగా మటన్ తింటూ ఉండేది. పెళ్లి చూపుల సమయంలో ఇదే విషయాన్ని కాబోయే భర్తకు కూడా చెప్పింది. మొదట షాక్‌కు గురైన అతను.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆమెను వదులుకోలేక, ఓ షరతు మాత్రం పెట్టాడు.

ప్రతీకాత్మక చిత్రం

వివాహం అయిన తర్వాత మటన్ జోలికి మాత్రం పోవద్దని చెప్పాడు. ఆ సమయంలో ఆమె కూడా సరే అని అంగీకరించింది. అనంతరం వారి పెళ్లి జరగడం, వేరు కాపుడం పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం, మరోవైపు మంచి ఉద్యోగం చేస్తుండడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండేవారు. అయితే బలవంతంగా కోరికను అనచిపెట్టుకున్న ఆమెకు.. ఓరోజు మళ్లీ మటన్‌పై గాలి మళ్లింది. భర్త లేని సమయంలో బయటికెళ్లి స్నేహితులతో కలిసి మటన్ లాగించేది.

కొన్నాళ్లకు ఈ విషయం భర్తకు తెలిసింది. ఇచ్చిన మాట తప్పి, మటన్ తినడంతో భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘‘నీకు మటన్ కావాలా.. లేక మొగుడు కావాలా’’.. తేల్చుకో అంటూ తెగేసి చెప్పేశాడు. అయితే కోపం తగ్గాక.. మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ప్రేమించిన భార్యను.. కేవలం మటన్ కోసం వదులుకోవడం అతడికి ఇష్టం లేదు. వెంటనే తనకు తెలిసిన ఫ్యామిలీ కౌన్సిలర్‌కు విషయం వివరిస్తూ లెటర్ రాశాడు. కౌన్సిలర్‌ నుంచి అతడికి ఈ విధంగా సమాధానం వచ్చింది.

‘‘శుభాకాంక్షలు. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీల్లో మీరు మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇక్కడ ఓ అమ్మాయి మనిషి, మటన్ మధ్య తనకు ఎవరు కావాలో ఎన్నుకోనుంది. నా అభిప్రాయం ఎంటంటే.. ప్రేమించిన వ్యక్తి లేకుండా జీవించవచ్చు... కానీ ఆహారం లేకుండా బతకలేం కదా. మరి నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో ఊహించు’’ అని సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టు ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement