రోడ్డు మీద పరిచయమైన మహిళతో లారీ డ్రైవర్ వివాహం.. అయితే పెళ్లి తర్వాత కూడా అదే పని చేస్తుండడంతో..

ABN , First Publish Date - 2021-11-18T21:56:20+05:30 IST

లారీ క్లీనర్‌కు రోడ్డుపైన వ్యభిచార వృత్తి చేసే ఓ మహిళ పరిచయమైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనంతరం చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నాడు. అయితే

రోడ్డు మీద పరిచయమైన మహిళతో లారీ డ్రైవర్ వివాహం.. అయితే పెళ్లి తర్వాత కూడా అదే పని చేస్తుండడంతో..

ప్రేమ ఎలాంటి వారినైనా మారుస్తుందంటారు. పెళ్లికి ముందు ఎలాంటి జీవితం గడిపినా.. పెళ్లి తర్వాత మాత్రం కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే సంసారంలో కలహాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు సాక్ష్యం. ఓ లారీ క్లీనర్‌కు రోడ్డుపైన వ్యభిచార వృత్తి చేసే ఓ మహిళ పరిచయమైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనంతరం చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నాడు. అయితే తర్వాత వారి సంసారంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే...


కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన పార్ష శ్రీధర్ లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు  లారీలో వెళ్తుండగా.. గుంటూరు దగ్గర నల్లపాడు వద్ద అర్ధరాత్రి టార్చి లైట్స్ వేస్తూ కొందరు మహిళలు లారీలు ఆపారు. వ్యభిచార వృత్తి చేసే ఆ మహిళల్లో తిరుమపతమ్మ అనే మహిళను శ్రీధర్.. ఇష్టపడ్డాడు. అప్పటికే ఆమెకు పెళ్లై.. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విడిపోయిన ఆమె వ్యభిచారాన్ని వృత్తిగా కొనసాగిస్తోంది. తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. తర్వాత మాట తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుని గిద్దలూరులో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సమస్యలు మొదలయ్యాయి.


అయితే పెళ్లి తర్వాత అయినా పద్ధతి మార్చుకోవాల్సిన తిరుతమ్మ.. అలా చేయకుండా మళ్లీ వ్యభిచారం చేయడం మొదలెట్టింది. భర్త డ్యూటీకి వెళ్లగానే పరాయి మగవారితో శారీరకంగా కలవడం మొదలెట్టేది. ఓ రోజు విషయం తెలుసుకున్న శ్రీధర్.. తిరుపతమ్మను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండు రోజుల క్రితం ఇదే విషయమై గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీధర్.. ఇంట్లోని నాన్‌స్టిక్ పాన్ తీసుకొని భార్య తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మ‌ృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-11-18T21:56:20+05:30 IST