విరాట్, రోహిత్ శర్మల పేలవప్రదర్శనపై గంగూలీ రియాక్షన్

ABN , First Publish Date - 2022-04-30T01:25:59+05:30 IST

ముంబై : టీమిండియా స్టార్ ప్లేయర్లు virat kohli, rohit sharma ఈ ipl 2022లో ఇద్దరూ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.

విరాట్, రోహిత్ శర్మల పేలవప్రదర్శనపై గంగూలీ రియాక్షన్

ముంబై : టీమిండియా స్టార్ ప్లేయర్లు virat kohli, rohit sharma ipl 2022 సీజన్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. తమ ప్రమాణాలకు తగ్గట్టు ఆడడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సీజన్ ఇద్దరికీ పీడకలలా మారింది.  పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న వీరికి మాజీల నుంచి సలహాలు, సూచనలు అందుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో cricket fans  కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్,  bcci president saurav ganguly కూడా కోహ్లీ, రోహిత్ శర్మల ప్రదర్శనపై స్పందించాడు. ఆటగాళ్లిద్దరికీ మద్దతుగా నిలిచాడు. త్వరలోనే వీరిద్దరూ పరుగులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఫామ్‌లోకి వస్తారని నాకు నమ్మకం ఉంది. త్వరలోనే పరుగులు సాధిస్తారు. విరాట్ కోహ్లీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ త్వరలోనే తిరిగి ఫామ్‌ అందుకుంటాడనే నమ్మకం ఉంది. సందేహం లేదు అద్భుతంగా పరుగులు సాధిస్తాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాను. ఏ జట్టయినా టైటిల్ గెలిచే అవకాశం ఉంది. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. కొత్త టీంలు రెండు gujarat titans, lucknow super giants చాలా బాగా ఆడుతున్నాయి’’ అని గంగూలీ అంచనా వేశాడు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు.


కాగా విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 16 పరుగుల సగటుతో మొత్తం 128 పరుగులు సాధించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నా జట్టుతోపాటు విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి.. 19.13 సగటుతో మొత్తం 153 పరుగులు నమోదు చేశాడు. ఇద్దరూ ఇప్పటివరకూ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోవడం గమనార్హం.


మరోవైపు రెండు కొత్త జట్లూ అద్భుతంగా రాణిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ప్రత్యర్థి జట్లకు కష్టంగా మారింది. దాదాపు అన్నీ జట్లపైనా విజయాలు సాధించింది. మొత్తం 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌పై అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 10 పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. అయితే మూడవ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 5వ స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 10 పాయింట్లతోనే కొనసాగుతుండడం గమనార్హం.

Updated Date - 2022-04-30T01:25:59+05:30 IST