Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాహ సమయానికి ఆరోగ్యంగా, కళకళలాడుతూ కనిపించాలంటే..

ఆంధ్రజ్యోతి(24-02-2020)

ప్రశ్న: మరో మూడు నెలల్లో నా పెళ్లి.  వివాహ సమయానికి ఆరోగ్యంగా, కళకళలాడుతూ కనిపించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- మైథిలి, హైదరాబాద్‌


 జవాబు: ఈ మూడు నెలల్లో కొన్ని జాగ్రత్తలను పాటించినట్లయితే ముహూర్తం సమయానికి ఆకర్షణీయంగా, ఉత్సాహంగా కనిపించవచ్చు. మీరు ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి - సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర. ‘వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఆహారం ఎలా తీసుకున్నా ఇబ్బంది ఉండదు’ అనే భ్రమ పనికిరాదు. రోజూ అరలీటరు పాలు లేదా పెరుగు, రెండు కప్పుల కూరగాయలు, రెండు రకాల పళ్ళు, మొలకెత్తిన గింజలు తీసుకోండి. ముఖ్యంగా దానిమ్మ, బొప్పాయి, పుచ్చ, కర్బూజా వంటి పళ్ళను ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. వీలున్నంత వరకు అన్నానికి బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైనవి తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ముప్పావుగంట వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం వల్ల బరువు నియంత్రణలో ఉండడమే కాక చర్మం మంచి మెరుపును సంతరించు కుంటుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...