ప్లాస్టిక్ సర్జరీతో ప్రాణాలకు ముప్పు?.. నిపుణులు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-05-19T14:20:08+05:30 IST

కన్నడ నటి చేతన రాజ్ మరణానంతరం..

ప్లాస్టిక్ సర్జరీతో ప్రాణాలకు ముప్పు?.. నిపుణులు ఏమంటున్నారంటే..

కన్నడ నటి చేతన రాజ్ మరణానంతరం ప్లాస్టిక్ సర్జరీపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. టెలివిజన్ నటి చేతనా రాజ్ బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మరణించారు. శస్త్రచికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 21 ఏళ్ల నటి చేతనా రాజ్.. ప్లాస్టిక్ సర్జరీ కోసం డాక్టర్ శెట్టి కాస్మెటిక్ సెంటర్‌లో చేరారు. చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఇటువంటి కేసులు చాలా అరుదు. 


వైద్యంలో పర్యవేక్షణ అవసరం. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఎదురయ్యే సమస్యల కారణంగా బాధితులు మరణించిన సందర్భాలు చాలా అరుదు. ఆపరేషన్ అనంతర 24 గంటలు చాలా క్లిష్టమైనవి. ఆ వ్యవధిలో రోగిని పరిశీలనలో ఉంచాల్సిన అవసరం ఉంది. దీని గురించి సర్ గంగారామ్ హాస్పిటల్‌కు చెందిన ప్లాస్టిక్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ కుమార్ మాట్లాడుతూ శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా మరణానికి కారణం ఏమిటో చెప్పడం కష్టం. గ్లోబల్ అధ్యయనం ప్రకారం, ఇటువంటి కేసులలో మరణించే సంభావ్యత లక్ష మందిలో 20 మాత్రమే అని తేలింది. అంటే ఇటువంటి కేసులలో మరణం సంభావ్యత 0.02 శాతం మాత్రమే అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో డ్రగ్స్‌కు రియాక్షన్‌, యాంటీబయాటిక్‌ ఇచ్చిన తర్వాత అలర్జీ లేదా అనస్థీషియా ప్రభావం వల్ల తీవ్రమైన రియాక్షన్‌ లేదా పల్మనరీ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల గుండెపోటు వచ్చి మరణం సంభవించవచ్చునని డాక్టర్ వివేక్ తెలిపారు. 

Updated Date - 2022-05-19T14:20:08+05:30 IST