బాలీవుడ్ బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండేను కూడా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణకు పిలిచారు. గురువారం ఉదయం అనన్య ఇంటిపై దాడులు చేసిన ఎన్సీబీ టీమ్ ఆమెకు సంబంధించిన ల్యాప్‌టాప్, ఫోన్ వంటి వాటిని సీజ్ చేసింది. అనంతరం ఆమెను విచారించింది. ఆ విచారణలో ఆర్యన్‌కు సంబంధించిన పలు ప్రశ్నలను ఎన్సీబీ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది.
* మీకు, ఆర్యన్ ఖాన్‌తో ఎప్పట్నుంచి పరిచయం?
* ఆర్యన్ ఖాన్‌తో కలిసి పార్టీలకు వెళ్లేవారా?
* మీకు డ్రగ్స్ అలవాటు ఉందా?
* పార్టీల్లో ఆర్యన్ ఖాన్ కానీ, ఇతర ప్రముఖులు కానీ డ్రగ్స్ తీసుకుంటుండగా మీరు చూశారా?
* ఆర్యన్ ఖాన్‌తో వాట్సప్ చాటింగ్ చేసింది మీరే కదా?
* ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ డీలర్లతో పరిచయం ఉందా? మీకు ఆ వివరాలు తెలుసా?
వంటి ప్రశ్నలను అనన్యను ఎన్సీబీ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. అయితే వీటికి ముక్తసరిగా `లేదు`, `కాదు` అంటూ అనన్య సమాధానాలిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.