May 12 2021 @ 08:04AM

చంద్రశేఖర్ యేలేటి కథ రాస్తుంది ప్రభాస్ కోసమేనా..!

టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కోసం హైరేంజ్ స్క్రిప్ట్ రాస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించే సినిమాలన్ని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంటాయి. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నప్పటికి మంచి కథాంశంతోనే వచ్చి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో యూత్‌స్టార్ నితిన్‌తో తెరకెక్కించిన చెక్ సినిమా కాస్త నిరాశపరచినప్పటికి దర్శకుడిగా మాత్రం మంచి పేరే వచ్చింది. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ను దృష్ఠిలో పెట్టుకొని పాన్ ఇండియన్ లెవల్‌లో కథ సిద్దం చేస్తున్నాడట. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి నెరేట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కథ గనక ప్రభాస్‌కు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన కమిటయిన సినిమాల తర్వాత చంద్ర యేలేటి ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.