Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 26 Jan 2022 16:21:09 IST

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..

twitter-iconwatsapp-iconfb-icon
పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..చాంద్ పాషా (ఫైల్)

కొత్తగా పెళ్లయిన జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. భార్య అడిగిందే తడవుగా అన్నీ సమకూరుస్తుంటారు. కొందరు భర్తను అర్థం చేసుకుని ఏవి అడగాలో, ఏవి అడగకూడదో తెలుసుకుని మసలుకుంటూ ఉంటారు. కొందరు మహిళలైతే ఆర్థిక పరిస్థితుల గురించి అసలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన కోరికలన్నీ కోరుతుంటారు. భార్య కోరికలను కాదనలేక ఎంత కష్టమైనా తీరుస్తుంటారు కొందరు. బెంగళూరులో పెళ్లయి నాలుగు నెలలు కూడా గడవకముందే ఆ కాపురంలో కలతలు రేగాయి. భార్య వింత వింత కోరికలన్నింటినీ తీర్చలేక.. భర్త తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులోని బసవేశ్వరనగర్ పరిధి మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ పాషా.. మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. నాలుగు నెలల క్రితం ఇతడికి ఉస్మా అనే యువతితో వివాహమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో ఈసారైనా కలతలు లేకుండా జీవనం సాగించాలని కోరుకునేవారు. పెళ్లయిన కొత్తలో భార్యను వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తూ సంతోష పెట్టేవాడు. ఈ క్రమంలో తనకు చిన్న చిన్న బహుమతులు కొనిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లు బాగున్న భార్య.. తర్వాత పెద్ద పెద్ద కోరికలు కోరేది. మెకానిక్ పని చేసే చాంద్ పాషా ఆదాయం అంతంతమాత్రమే కావడంతో మొదట కొంత ఇబ్బంది పడేవాడు.

అస్వస్థత కారణంగానే కొడుకు చనిపోయాడనుకున్నారు.. ఓ రోజు కోడలు ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుమానం రావడంతో..

భర్త ఆర్థిక పరిస్థితి గురించి అసలు పట్టించుకోని ఉస్మా.. రోజుకో కోరిక కోరేది. అయితే ఎంత ఇబ్బందిగా ఉన్నా కొన్నాళ్లు ఆమె అడిగినవన్నీ కొనిచ్చేవాడు. రానురాను పెద్ద పెద్ద కోరికలు కోరడంతో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ఉస్మా మాత్రం వినిపించుకునేది కాదు. పైగా ‘‘ భార్యను బాగా చూసుకోలేని వాడివి.. నువ్వేం మగాడివి’’.. అంటూ వేధించేది. రోజురోజుకూ వేధింపులు పడలేక.. మరోవైపు బయట ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి అంతా పడుకున్నాక చాంద్ పాషా.. వేరే గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆటో డ్రైవర్‌కు వివాహితతో అనుకోకుండా పరిచయం.. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ సీన్..కార్ల షోరూంలో రైతుకు అవమానం.. దాంతో చివరకు షోరూం వారికి ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు!టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా.. ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.