Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోల్‌ 30 డైట్‌ అంటే ఏమిటి?

ఆంధ్రజ్యోతి(15-06-2020)

ప్రశ్న: హోల్‌ 30 డైట్‌ అంటే ఏమిటి? 

- సువర్చల, సికంద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: హోల్‌ 30 డైట్‌ అనేది నెల రోజులపాటు కొన్ని నియమాలకు లోబడి ఆహారాన్ని తీసుకోవడం. ఈ డైట్‌ చేసేవారు నెల పాటు అన్ని రకాల ధాన్యాలు; పప్పు ధాన్యాలు; చాలా రకాల గింజలు; పాలు, పాల పదార్థాలు; తీపి పదార్థాలు;  ప్రాసెస్డ్‌ ఆహారం తినడం నిషేధం. గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లు, నట్స్‌, గింజల నుంచి తీసిన నూనెలు, నెయ్యి మాత్రం తినవచ్చు. ఈ డైట్‌ చేస్తున్న ముప్పయి రోజుల మధ్యలో ఎప్పుడైనా నిషేధించబడిన పదార్థాలు ఏవైనా తిన్నట్లయితే ఆ రోజు నుండి మరొక ముప్పయి రోజులు ఈ డైట్‌ చేయాల్సి ఉంటుంది. ఓసారి పూర్తిగా 30 రోజులు ఈ విధంగా తిన్న తరువాత నెమ్మదిగా ఒకదాని తరువాత ఒకటిగా నిషేధించబడిన పదార్ధాలను తినడం మొదలు పెట్టాలి.  మాంసాహారులకు ఈ డైట్‌ చేయడం కొంత వరకు సాధ్యమైనా తేలిక మాత్రం కాదు. శాకాహారులు ఈ డైట్‌ చెయ్యాలంటే ఒక నెల రోజుల పాటు వారి ఆహారంలో మాంసకృత్తుల మోతాదు తగ్గుతుంది. కఠినమైన నియమాలున్న ఈ హోల్‌ 30 డైట్‌ చేయడం వల్ల ఏవైనా ఆహారం పడకపోవడం అనే విషయాన్ని కనిపెట్టగలగడం తప్ప ఆరోగ్య పరంగా ఎక్కువ ఉపయోగాలేమీ లేవు. ఒకవేళ ఎవరైనా హోల్‌ 30 డైట్‌ చేయదలుచుకుంటే నిపుణులతో సంప్రదించి వారి సలహా మేరకే చేయడం మేలు.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement