దానిమ్మ పండులోని పోషక విలువలు ఏంటో తెలియజేయండి..?

ABN , First Publish Date - 2022-03-11T20:30:42+05:30 IST

చక్కటి రంగు, రుచితో అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది దానిమ్మ పండు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలం ఇది. ఒక కప్పు దానిమ్మగింజ

దానిమ్మ పండులోని పోషక విలువలు ఏంటో తెలియజేయండి..?

ఆంధ్రజ్యోతి(11-03-2022)

ప్రశ్న: చూడచక్కని రంగుతో ఆకర్షిస్తుంది దానిమ్మ. ఈ పండులోని పోషక విలువలు తెలియచేయండి. 


- పవన్‌, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: చక్కటి రంగు, రుచితో అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది దానిమ్మ పండు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలం ఇది. ఒక కప్పు దానిమ్మగింజల నుంచి రోజుకు కావలసిన పీచుపదార్థంలో నాలుగో వంతు, విటమిన్‌ - సి లో మూడోవంతు లభిస్తుంది. దానిమ్మ గింజలకు ఎరుపునిచ్చే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్ల వల్ల క్యాన్సర్‌ వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్ళలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని నిరోధిస్తాయి ఈ యాంటీఆక్సిడెంట్లు. ఆర్థ్రరైటిస్‌, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు, అధిక రక్తపోటు మొదలైన జీవనశైలి వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు దానిమ్మ ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న దానిమ్మను జ్యూస్‌గా చేసుకొని తాగితే దానిలోని పీచుపదార్థాన్ని కోల్పోతాం కాబట్టి గింజలను తినడమే మంచి పద్ధతి. చక్కెరలు, కెలోరీలు కాస్త అధికంగా ఉంటాయి కాబట్టి ఊబకాయం, మధుమేహం ఉన్నవారు దానిమ్మ గింజలను అరకప్పు కంటే ఎక్కువ తీసుకోవద్దు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-03-11T20:30:42+05:30 IST