పాలు తాగడానికి సతాయిస్తున్నాడు.. బదులుగా ఏం ఇస్తే బాగుంటుంది?

ABN , First Publish Date - 2021-10-08T17:20:48+05:30 IST

మా బాబుకు మూడేళ్లు. పాలు తాగడానికి సతాయిస్తున్నాడు. ప్రత్యామ్నాయంగా సోయా పాలు ఇవ్వవచ్చా? దాని వల్ల లాభాలుంటాయా?

పాలు తాగడానికి సతాయిస్తున్నాడు.. బదులుగా ఏం ఇస్తే బాగుంటుంది?

ఆంధ్రజ్యోతి(08-10-2021)

ప్రశ్న: మా బాబుకు మూడేళ్లు. పాలు తాగడానికి సతాయిస్తున్నాడు. ప్రత్యామ్నాయంగా సోయా పాలు ఇవ్వవచ్చా? దాని వల్ల లాభాలుంటాయా?


- రమణి, పాలకొల్లు


డాక్టర్ సమాధానం: పాలు, వాటి ఉత్పత్తులైన పెరుగు, పనీర్‌, చీజ్‌ లాంటి పదార్థాలు కాల్షియం, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, బీ12, విటమిన్‌- డి లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలందరికీ ఈ పోషకాలు అత్యవసరం. ఇవన్నీ లభించే వేరే ఆహారం సక్రమంగా తీసుకుని, పిల్లలు పాలు తక్కువగా తాగితే ఇబ్బంది ఉండదు. ఒక వేళ మీ బాబు పాల రుచిని ఇష్టపడక, మిగిలిన పాల పదార్థాలైన పెరుగు, మజ్జిగ, పనీర్‌, చీజ్‌ లాంటివి ఇష్టంగానే తింటున్నప్పుడు ప్రత్యామ్నాయాలు వెతకనవసరం లేదు. కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వల్లో లేదా పూర్తిగా అన్ని పాలపదార్థాలనూ ఇష్టపడకపోవడం లాంటి కారణాలున్నప్పుడు సోయాపాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. సోయా పాలలో కూడా దాదాపు ఆవు లేదా గేదె పాలలోని పోషకాలన్నీ ఉంటాయి. మామూలు పాలకంటే సోయాపాలలో ఐరన్‌, పీచుపదార్థాలు ఎక్కువ. సోయాపాలల్లో కొవ్వు  తక్కువగా ఉండడం వల్ల వెన్న తీయని పాలకన్నా వీటి నుండి వచ్చే కెలోరీలు తక్కువ. కాబట్టి పిల్లలకు మామూలు పాలకు ప్రత్యామ్నాయంగా సోయాపాలను ఇచ్చేటప్పుడు మిగతా ఆహారం ద్వారా తగినన్ని కెలోరీలు వచ్చేలా జాగ్రత్త పడాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-10-08T17:20:48+05:30 IST