Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నానికి ప్రత్యామ్నాయంగా వాటిని తింటారు..

ఆంధ్రజ్యోతి(23-04-2021)

ప్రశ్న: మరమరాల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి? 


- రాధిక, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: మరమరాలు బియ్యం నుంచి తయారవుతాయి. అందువల్ల బియ్యంలో ఉండే పోషకాలే వీటిలోనూ ఉంటాయి. వీటిని నిల్వ ఉంచడం సులభం. తేలికగా అరుగుతాయి. అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉండడం వల్ల మరమరాలు చిరుతిండిగా, ఉదయం అల్పాహారంగా, కొన్ని ప్రాంతాల్లో అన్నానికి ప్రత్యామ్నాయంగా కూడా వాడతారు. వంద గ్రాముల మరమరాల్లో నాలుగు వందల కెలోరీలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం పిండి పదార్థాలే కాబట్టి అన్నం మితంగా తీసుకోవలసిన మధుమేహులు మరమరాలను తక్కువగానే తీసుకోవాలి. సాధారణంగా మనకు లభించే మరమరాలు విటమిన్లు, ఖనిజాలు కలిపినవి కాదు కాబట్టి వీటి నుంచి ఎక్కువగా పోషకాలు అందవు. అయితే  వీటిలోకొవ్వులు తక్కువ. కొద్దిగా తీసుకున్నా పరిమాణం ఎక్కువగా అనిపించడం వల్ల మరమరాలను చిరుతిండిగా తీసుకుంటే నష్టమేమి ఉండదు. మరమరాలకు చక్కర పాకం, బెల్లం తదితర అధిక కెలోరీల పదార్థాలను చేర్చి చేసే చిరుతిళ్ళకు మాత్రం దూరంగా ఉండడమే మంచిది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement