Oct 19 2021 @ 00:54AM

ఆ గ్రామం కథేమిటి?

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రం ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల అయింది. మోషన్‌ పోస్టర్‌లో హీరో విలన్‌ తల నరికి ఓ చేత్తో పట్టుకుని, మరో చేత్తో ఓ మహిళను ఎత్తుకోవడం ఆసక్తి కలిగించింది. ఆమెను కాపాడేందుకే హీరో ఈ హత్య చేశాడా, అసలు మధురపూడి గ్రామం కథ ఏమిటి అనే అంశాలు కుతూహలాన్ని పెంచుతున్నాయి. 


‘కల్యాణ్‌రామ్‌ కత్తి’ చిత్ర దర్శకుడు మల్లి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జి.రాంబాబు  యాదవ్‌ సమర్పణలో కె.ఎస్‌.శంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలు: కె.శ్రీధర్‌రెడ్డి, ఎం.జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కె.శ్రీనివాసరావు, వై. అనిల్‌కుమార్‌.