రూ.2 కాయిన్‌ను మింగిన బాలిక.. మర్నాడే బయటకు వచ్చిందనుకున్న తల్లిదండ్రులు.. నాలుగేళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-04-28T18:30:38+05:30 IST

చిన్న పిల్లలు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ వయసులో ఆటలే వారి ప్రపంచం. అయితే పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో చాలా మంది పిల్లలు...

రూ.2 కాయిన్‌ను మింగిన బాలిక.. మర్నాడే బయటకు వచ్చిందనుకున్న తల్లిదండ్రులు.. నాలుగేళ్ల తర్వాత..

చిన్న పిల్లలు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ వయసులో ఆటలే వారి ప్రపంచం. అయితే పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో కొన్నిసార్లు పిల్లల ప్రాణాలకే ముప్పు వాటిళ్లిన సందర్భాలు కూడా చాలా చూశాం. బీహార్‌లో నాలుగేళ్ల బాలిక పొరపాటున రూ.2కాయిన్ మింగింది. మరుసటి రోజు బయటికి వచ్చుంటుందిలే అనుకుని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ప్రస్తుతం బాలికకు ఎనిమిదేళ్లు వచ్చాయి. నాలుగేళ్ల తర్వాత వారికి అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


బీహార్ ముజఫర్‌పూర్ పరిధి బెట్టియా జిల్లా నార్కతియాగంజ్ బ్లాక్‌లోని నోనియా తోలా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ సాహ్ అనే వ్యక్తి భార్య, కుమార్తె  సుష్మా కుమారితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుమార్తెకు నాలుగేళ్లు ఉన్న సమయంలో ఆడుకుంటూ పొరపాటున రూ.2 కాయిన్ మింగింది. అయితే మరుసటి రోజు బయటికి వస్తుందిలే అనుకుని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం బాలిక.. ఛాతిలో నొప్పితో తరచూ అస్వస్థతకు గురవుతూ ఉండేది. దీంతో అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మేనమామ ఇంటికి వెళ్లిన మేనల్లుడు... సరదాగా మేడపైకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతుండగా..


ఎక్స్ రే తీసిన వైద్యులు.. బాలిక ఛాతిలో కాయిన్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి, కాయిన్‌ను బయటికి తీయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ చేయించే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.

ఇకపై మీ ఇంటి పేరు విషయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. కోర్టు ఏమంటోందంటే..

Updated Date - 2022-04-28T18:30:38+05:30 IST