ఇద్దరు మంత్రులున్నా ప్రయోజనమేంటి?

ABN , First Publish Date - 2021-11-09T16:19:15+05:30 IST

ఇద్దరు మంత్రులున్నా..

ఇద్దరు మంత్రులున్నా ప్రయోజనమేంటి?
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు(కర్నూలు): వాటర్‌ స్కీంలలో పనిచేస్తున్నకార్మికులకు 16 నెలలుగా వేతనాలు రాకపోతే ఎలా బతుకుతారని కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ ప్రశ్నించారు. వేతనాలు చెల్లించాలంటూ ఆలూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద మూడు రోజులుగా కార్మికులు చేపట్టిన రిలే దీక్ష శిబిరంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఇన్ని నెలలుగా నిధులు విడుదల కాకపోతే జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటికి 24 గంటలు నీరు సరఫరా అవుతున్నా ప్రజలకు మాత్రం 20 రోజులకు ఒకసారైనా నీరు సరఫరా ఎందుకు కావడం లేదన్నారు. కార్మికులకు వారంలోపు వేతనాలు చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 



Updated Date - 2021-11-09T16:19:15+05:30 IST