మట్టి, బలపాలను తినాలనిపిస్తోంది.. మానాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-04-22T17:07:56+05:30 IST

బలపాలు, మట్టి లాంటి వాటిని తినే అలవాటు ఎందుకుంటుంది? మానాలంటే ఎలా?

మట్టి, బలపాలను తినాలనిపిస్తోంది.. మానాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(22-04-2022)

ప్రశ్న: బలపాలు, మట్టి లాంటి వాటిని తినే అలవాటు ఎందుకుంటుంది? మానాలంటే ఎలా?


- వినూత్న, ఖమ్మం


డాక్టర్ సమాధానం: ఆహార పదార్థాలను కాకుండా మట్టి, బలపాలు, పెన్సిల్స్‌ పెయింట్‌, జుట్టు, ఇసుక మొదలైన పదార్థాలను తినడాన్ని ‘పైకా’ (ఞజీఛ్చి) అంటారు. కొంతమంది గర్భిణులలో, ఒక్కొక్కసారి మానసిక పరిణతి లేని వారిలో, స్కిజోఫ్రెనియా, ఓసీడీ మొదలైన మానసిక సమస్యలున్నవారిలో, కొన్నిరకాల పోషక లోపాలు ఉన్నవారిలో ఈ పైకా సమస్య ఎక్కువ. ఈ అలవాటు వల్ల అవి తింటుంటే ఫుడ్‌ పాయిజనింగ్‌, పేగులలో బ్లాకేజి, ప్యారసైట్‌ ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు వస్తాయి. ఒకవేళ పోషకాహార లోపం వల్ల పైకా సమస్య ఉన్నట్టు వైద్యుల పరీక్షలలో తేలితే అవసరమైన పోషకాల ట్యాబ్లెట్లను తీసుకుంటే సరిపోతుంది. మానసిక సమస్యల వల్ల పైకా ఉన్నవారికి మానసిక వైద్యుల కౌన్సెలింగ్‌, ట్రీట్‌మెంట్‌ అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-04-22T17:07:56+05:30 IST