Advertisement
Advertisement
Abn logo
Advertisement

గానుగ నూనె మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(15-03-2020)

ప్రశ్న: గానుగ నూనెలకు, బ్రాండెడ్‌ నూనెలకు తేడా ఏమిటి? గానుగ నూనెలు మంచివేనా?


- హరీష్‌, విశాఖపట్నం


డాక్టర్ జవాబు: గానుగ నూనెలు మార్కెట్లో కోల్డ్‌ప్రెస్డ్‌ నూనెలుగా దొరుకుతున్నాయి. గానుగ  తీసిన నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేస్తారు. అందుకే చక్కటి రుచి, సువాసన తోడవుతాయి. పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ పద్ధతిలో రసాయనాల వాడకం కూడా ఉండదు. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ - ఇ, ఒమేగా- 3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లెవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే రిఫైన్డ్‌ నూనెలతో పోలిస్తే గానుగ నూనెలకు త్వరగా దుర్వాసన వచ్చే  ఆస్కారం ఉంది. అందువల్ల నెలనెలా వాడకానికి తగినంత మాత్రమే కొనుక్కోవడం మంచిది. ఒక వేళ ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సి వస్తే ఎండ తగలని ప్రదేశంలో, ముదురు రంగు గాజు సీసాల్లో మాత్రమే  భద్రపరచాలి.  ఫ్రిజ్‌లో  అయితే మూడు నెలల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. గానుగ నూనెలోని పోషకాలన్నీ అందాలంటే వాటిని ఎక్కువ ఉష్ణోగ్రతలకు వేడి చెయ్యకూడదు. ముఖ్యంగా  వేపుళ్లకు గానుగ నూనెలను వాడకపోవడమే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను 

[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...