ఉక్రెయిన్‌పై రష్యా 750కిపైగా క్షిపణులను ప్రయోగించింది… క్షిపణిని ప్రయోగానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-12T16:37:22+05:30 IST

దాదాపు రెండు వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య..

ఉక్రెయిన్‌పై రష్యా 750కిపైగా క్షిపణులను ప్రయోగించింది… క్షిపణిని ప్రయోగానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

దాదాపు రెండు వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై అనేక క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు రష్యా.. ఉక్రెయిన్‌పై 700కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఫలితంగా ఉక్రెయిన్‌లో భారీ విధ్వంసం జరిగింది. అయితే క్షిపణి ప్రయోగానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించింది. తొలిరోజు 160 క్షిపణులతో దాడులు చేసింది. 


అప్పటి నుంచి ప్రతిరోజూ 40 నుంచి 65 క్షిపణులను ప్రయోగిస్తూ వచ్చింది. రష్యా ఇప్పటివరకు 775 క్షిపణులను ప్రయోగించింది. ఎయిర్ క్షిపణి ధర 25 వేల డాలర్ల నుండి 7 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. సిఎన్‌బిసి నివేదిక తెలిపిన వివరాల ప్రకారం సిరియాపై యుఎస్ క్షిపణుల వర్షం కురిపించినప్పుడు ఒక క్షిపణి ఖరీదు 1.4 మిలియన్ డాలర్లు అని ప్రకటించారు. అనేక రకాల క్షిపణులను ఆర్మీ ఫోర్స్ ఉపయోగిస్తుంటుంది. వాటి ధర మారుతూ ఉంటుంది. దీని ప్రకారం చూస్తే 70 మి.మీ. క్షిపణి ధర 28 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఇలాంటి యూకే బ్రిమ్‌స్టోన్ క్షిపణి ధర  150,000 డాలర్ల వరకు ఉంటుంది. అదే సమయంలో 500 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల ధర సుమారు  1.4 మిలియన్ డాలర్లని జీఏఓ నివేదిక పేర్కొంది.


Updated Date - 2022-03-12T16:37:22+05:30 IST