కొవిడ్‌ను ఎదుర్కొనే సమర్థ వ్యూహమేదీ?: రాహుల్‌

ABN , First Publish Date - 2021-04-17T07:40:59+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం సమర్థమైన వ్యూహం చేపట్టలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. తుగ్లక్‌ లాక్‌డౌన్‌ విధించడం, గంటలు మోగించడం, దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడటమేనా కరోనా వైర్‌సను

కొవిడ్‌ను ఎదుర్కొనే సమర్థ వ్యూహమేదీ?: రాహుల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 : కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం సమర్థమైన వ్యూహం చేపట్టలేదని కాంగ్రెస్‌ నేత  రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. తుగ్లక్‌ లాక్‌డౌన్‌ విధించడం, గంటలు మోగించడం, దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడటమేనా కరోనా వైర్‌సను తుదముట్టించే వ్యూహం? అని నిలదీశారు. లాక్‌డౌన్‌ విధించడానికి బదులు వైద్య, ఆరోగ్య మౌలిక వసతులను పెంపొందించాలని తాను నిరుడే హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ఏడాది తర్వాతా ప్రజలకు కరోనా కష్టాలు తొలగిపోలేదు. ఆరోగ్యరంగంలో మౌలికవసతుల లేమి వెన్నాడుతూనే ఉంది. బాధ్యతల నుంచి ప్రధాని పరారు కావడం కొనసాగుతూనే ఉంది’ అని ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-04-17T07:40:59+05:30 IST