Advertisement
Advertisement
Abn logo
Advertisement

అల్లుడి సమస్య ఏమై ఉంటుంది?

ఆంధ్రజ్యోతి (07-02-2020):

డాక్టర్‌! మా అమ్మాయికి మూడేళ్ల క్రితం పెళ్లి చేశాం. అల్లుడు ఇప్పటివరకూ అమ్మాయితో శారీరకంగా కలవలేదు. అమ్మాయి లావుగా ఉందనీ, తనకు నచ్చినట్టు నడుచుకోవడం లేదనీ సాకులు చెబుతూ, దూరంగా ఉంటున్నాడు. పైగా అతను పురుషులతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు అమ్మాయి చెబుతోంది. అతను స్వలింగసంపర్కా? లేక ఇతర కారణాలతో అమ్మాయికి దూరంగా ఉంటున్నాడా? అతని సమస్య తెలుసుకునేదెలా?

- ఓ సోదరుడు, విజయనగరం

 

శారీరక సంపర్కానికి దూరంగా ఉండడానికి భయమే కారణం అయితే కౌన్సెలింగ్‌తో సమస్యను చక్కదిద్దవచ్చు. అయితే మీ అమ్మాయి అనుమానిస్తున్నట్టు అతను స్వలింగసంపర్కి అయిన పక్షంలో, అతన్ని మార్చడం వీలుపడదు. పైగా బలవంతంగా అతన్ని మార్చే ప్రయత్నం చేయటం చట్టవిరుద్ధం అవుతుంది. మీ అమ్మాయి లావుగా ఉందనీ, తన మాట వినడం లేదనీ, అందుకే తను లైంగికంగా కలవలేకపోతున్నాననీ మీ అల్లుడు అంటున్న మాటల్లో అర్థం లేదు.

 

పెళ్లికి ముందు అన్నీ తెలిసే ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సాకులు చూపించి ఆమెకు దూరంగా ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే మీ అల్లుడి సమస్యను కరెక్టుగా నిర్ధారించాలంటే వైద్యులకు చూపించాలి. ఇందుకోసం అతనితో మాట్లాడి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు నేరుగా అల్లుడిని అడగకుండా, అతనికి సన్నిహితమైన స్నేహితులు, లేదా బంధువుల్లోని ఓ వ్యక్తికి విషయం వివరించండి. అతని ద్వారా అల్లుడి వివరాలు రాబట్టండి. వీలైతే వారి సహాయంతో అల్లుడికి వైద్య పరీక్షలు చేయించండి. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. స్వలింగ సంపర్కి అని తేలిన పక్షంలో అమ్మాయికి విడాకులు ఇప్పించి, వేరే పెళ్లి చేయండి.

- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Advertisement
Advertisement