Abn logo
Jun 29 2020 @ 13:42PM

పాలియో డైట్ అంటే..

ఆంధ్రజ్యోతి(29-06-2020)

ప్రశ్న: పాలియో డైట్‌ అంటే ఏమిటి? ఆ డైట్‌ లాభనష్టాలు..

 

- నిఖిల్‌, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: ఆదిమానవుల ఆహారపు అలవాట్లను పోలినదే ‘పాలియో డైట్‌’. ఆకాలంలో వాళ్లు ‘అన్‌ ప్రాసెస్డ్‌ హోల్‌ ఫుడ్స్‌’ అంటే ప్రకృతి సహజంగా లభ్యమయ్యే ఆహారాన్ని తీసుకునేవారు. ఈ రకమైన డైట్‌ ప్రణాళికల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న వాటికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. పాలియో డైట్‌లో మాంసం, చేపలు, గుడ్లు, కూరగాయలు, బంగాళదుంపలు, చిలకడదుంపలు, కంద, బీట్‌రూట్‌, క్యారట్‌, పళ్లు, గింజలు, విత్తనాలు, మూలికలు, ముడి ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె ఉంటాయి. ఈ డైట్‌లో పూర్తిగా తొలగించాల్సినవి చక్కెర, చక్కెర పదార్థాలు, వరి, గోధుమ, ఓట్స్‌, బార్లీ, చిరుధాన్యాలు; కందిపప్పు, మినపప్పులాంటి పప్పులు, పాల ఉత్పత్తులు; వృక్షసంబంధ నూనెలు; ఇంకా అన్నిరకాల ప్రాసెస్డ్‌ ఆహారపదార్థాలు. సిద్ధాంతపరంగా పాలియో డైట్‌ ఆరోగ్యకరమైన ఆహారమే కానీ, పప్పులు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు లాంటి వాటిని నిరోధించడం వల్ల ఎవరైనా దీనిని ఎక్కువ కాలం పాటు అనుసరించడం ఆచరణీయం కాదు. ముఖ్యంగా శాకాహారులకు ఈ డైట్‌ చాలా కష్టం. పాలియో డైట్‌ వల్ల ఏయే లాభాలూ, ప్రయోజనాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా, నియంత్రితంగా అన్ని పదార్థాలను తీసుకుని, శారీరక శ్రమ చేస్తూ, చక్కటి జీవన విధానాన్ని అలవరచుకోవడం ద్వారా పొందవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement