లాంగ్‌ కొవిడ్‌ అంటే?

ABN , First Publish Date - 2021-03-30T05:49:35+05:30 IST

కొవిడ్‌ తగ్గిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ పరిస్థితే లాంగ్‌ కొవిడ్‌! ఈ సమయంలో తలెత్తే సమస్యలు ఇవే!

లాంగ్‌ కొవిడ్‌ అంటే?

కొవిడ్‌ తగ్గిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ పరిస్థితే లాంగ్‌ కొవిడ్‌! ఈ సమయంలో తలెత్తే సమస్యలు ఇవే!

నిస్సత్తువ: కరోనా వైరస్‌ శక్తి సన్నగిల్లేలా చేస్తుంది. కొవిడ్‌ ప్రధాన లక్షణాలేవీ వెంటాడకపోయినా తెలియని అలసట, నిస్సత్తువ దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. 

తరచూ తలనొప్పులు: లాంగ్‌ కొవిడ్‌లో నిస్సత్తువ తర్వాత కనిపించే మరో ముఖ్య లక్షణం తలనొప్పి. రోజు మొత్తంలో పలుసార్లు వస్తూ, తగ్గుతూ తలనొప్పులు పదే పదే వేధిస్తాయి.

ఊపిరి ఇబ్బందులు: కొవిడ్‌ కారక ఇన్‌ఫ్లమేషన్‌ శరీరం మొత్తంలో ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో తలెత్తే ఈ ఇన్‌ఫ్లమేషన్‌ దీర్ఘకాలం పాటు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిని కలగజేస్తుంది. 

ఏకాగ్రతా లోపం: దేని మీద మనసు లగ్నం చేయలేకపోవడం, ఏకాగ్రత తగ్గడం లాంగ్‌ కొవిడ్‌లో కనిపించే మరో ప్రధాన లక్షణం.

కండరాల నొప్పులు: వ్యాయామాలు చేయకపోయినా ఒళ్లు పచ్చి పుండులా బాధ పెట్టడం లాంగ్‌ కొవిడ్‌లో కొనసాగుతుంది. కండరాల నొప్పులు పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ఈ ఇబ్బందులన్నీ క్రమేపీ తగ్గిపోతాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అయితే కొవిడ్‌ నుంచి మెరుగ్గా కోలుకోవడం వైద్యులు సూచించిన చికిత్సను కొనసాగిస్తూ, పోషకభరిత ఆహారం తీసుకుంటూ ఉండాలి.

Updated Date - 2021-03-30T05:49:35+05:30 IST